https://oktelugu.com/

ఇద్దరి భార్యల మధ్య ‘రవితేజ’ హీరోయిజమ్ !

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం తానూ చేస్తోన్న ‘క్రాక్’ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాతే రవితేజ కెరీర్ ఇంకా ఎన్నాళ్ళు హీరోగా కొనసాగుతుందో డిసైడ్ అవుతోంది. అందుకే, రవితేజ కూడా క్రాక్ సినిమా హిట్ అవ్వాలని మొదటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తోన్న ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా కథ […]

Written By:
  • admin
  • , Updated On : September 27, 2020 / 07:22 PM IST
    Follow us on


    మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం తానూ చేస్తోన్న ‘క్రాక్’ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాతే రవితేజ కెరీర్ ఇంకా ఎన్నాళ్ళు హీరోగా కొనసాగుతుందో డిసైడ్ అవుతోంది. అందుకే, రవితేజ కూడా క్రాక్ సినిమా హిట్ అవ్వాలని మొదటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తోన్న ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఇద్దరి భార్యల మధ్య నడిచే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అట. ఈ సినిమాలో రవితేజ సరసన మెయిన్ హీరోయిన్ శ్రుతి హాసన్. సినిమాలో ఆమె రెండో బార్య పాత్రలో నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుంది. సినిమాలో ఆమె రవితేజ మొదటి భార్య పాత్రలో నటిస్తోంది.

    Also Read: కేకలు పెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌..

    కాగా కొన్ని కారణాల వల్ల తన భర్త రవితేజ పాత్రతో వరలక్ష్మీ పాత్ర విడిపోవడంతో మొదలైన వైర్యం తన భర్త రెండో భార్య శ్రుతి హాసన్ ను చంపే వరకూ వెళ్తుందని.. దన బలం, రాజకీయ బలం ఉన్న తన మొదటి భార్య నుండి.. తన కుటుంబాన్ని రవితేజ తన హీరోయిజమ్ తో ఎలా సేవ్ చేసుకున్నాడు అనే పాయింట్ మీద ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇక రవితేజ పాత్రకు వరలక్ష్మీ పాత్ర కూడా దీటుగా ఉంటుందని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మొత్తానికి లేడీ రౌడీ పాత్రలకే పరిమితం అవుతూ వస్తోన్న వరలక్ష్మి.. క్రాక్ సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే నటించబోతుంది అన్నమాట.

    Also Read: సంచలన సీక్రెట్ చెప్పిన హీరోయిన్ రష్మిక మందన్న

    ఇక క్రాక్ తరువాత ఏ సినిమా చేయాలి… ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి అనే మీమాంసలో ఉన్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు. అయితే రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుంది కాబట్టి దాదాపు రమేష్ వర్మకే రవితేజ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రవితేజ టైం ప్రస్తుతం అసలు బాగాలేదు. ‘డిస్కో రాజా’ సినిమా రవితేజ మార్కెట్ పై బాగా దెబ్బ వేసిందట. అందుకే క్రాక్ సినిమాకి సరిగ్గా బిజినెస్ కూడా జరగట్లేదని అంటున్నారు. మరి క్రాక్ సినిమాతో రవితేజ సాలిడ్ హిట్ అందుకుంటేనే.. మరో నాలుగేళ్లు అయినా హీరోగా కొనసాగే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.