Disha Website: ఈటల రాజేందర్ ను 50 లక్షలు అడిగారు. రేవంత్ రెడ్డిని కోటి రూపాయలు డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొనేశాడు. ఈ ఆరోపణల నుంచి దిశ వెబ్ పేపర్ కోలుకోకముందే మరో పెద్ద షాక్ తగిలింది. దూడెం మార్కండేయ తేరుకునే ముందే, రామ్మోహన్ మేల్కొక ముందే.. కొందరు కీలక వ్యక్తులు చేయాల్సిన నష్టం చేసేసారు.. దిశకు వెన్నెముక లాంటి ఇద్దరు కీలక ఉద్యోగులు ఇప్పటికే వైదొలిగి దీని పోటీగా పెడుతున్న సంస్థల్లో చేరిపోయారు.

-ఇతర యాజమాన్యాల ఆఫర్
ఐజేయూ కార్యవర్గంలోని కీలక జర్నలిస్టులు ” ముద్ర” పేరుతో ఓ ఆన్ లైన్ వెబ్ ఎడిషన్ ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే పలువురు సీనియర్ జర్నలిస్టులు చేరారు. కానీ బలమైన ఎడిటోరియల్ లేకపోతే ఎంత సీనియర్ జర్నలిస్టులు ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే కాబోలు సక్సెస్ ను అందుకున్న ‘దిశ’కు గాలం వేశారు. ఇద్దరూ కూడా ఒక సామాజిక నేపథ్యం ఉన్నవారు కావడం, పైగా వీరిద్దరి మధ్య వృత్తి గత అనుబంధం ఉండడంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో ఒక పెద్ద జర్నలిస్టు రాసుకొచ్చారు. మరో సీనియర్ జర్నలిస్టు కూడా వివిధ పత్రికల్లో పని చేశారు. దిశ పత్రికలో కీలక స్థానంలో ఉన్నారు. అయితే ఈయన పని తీరు గురించి తెలుసుకున్న ఓ మాజీ ఎంపీ తన పత్రికలో మంచి ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆయన దిశ పేపర్ కు రాజీనామా చేశారు.. ఈ పరిణామాలతో అసలు దిశ పేపర్లో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది.

-యూనియన్ నాయకుల ఒత్తిడి
అయితే దిశ పేపర్ కు సంబంధించి కీలక ఉద్యోగులు ఒకేసారి రాజీనామా చేయడంతో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది.. అయితే వారిద్దరి రాజీనామా వెనుక యూనియన్ నాయకుల హస్తం ఉందని తెలుస్తోంది.. వీరిద్దరూ కూడా జర్నలిస్ట్ యూనియన్ లో కీలక సభ్యులు కావడం, వివిధ అంశాలపై ఇద్దరికీ అనితర సాధ్యమైన పట్టు ఉండడంతో అటు ముద్ర యాజమాన్యం, ఇటు వెలుగు యాజమాన్యం మంచి ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటి తెర వెనుక జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ప్రోద్భలం కూడా ఉన్నట్టు సమాచారం.. ఏది ఏమైనప్పటికీ దిశ పేపర్ ఒక స్థాయికి వెళ్లే క్రమంలో కీలక ఉద్యోగులు ఇద్దరు రాజీనామా చేయడం కోలుకోలేని దెబ్బ అని జర్నలిస్టు సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: AP BRS: ఆంధ్రాలో కేసీఆర్ ‘బీఆర్ఎస్’ అడుగులు ఎలా ఉండబోతున్నాయి?
-ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంది
పత్రికలు అన్నాక అటు వాళ్ళు ఇటు,ఇటు వాళ్ళు అటు వెళ్లడం కామన్. కానీ కోవిడ్ తర్వాత చాలామంది జర్నలిస్టులలో వృత్తి అంటే ఒక రకమైన భయం ఏర్పడింది.. చాలామంది ఉద్యోగాలు కోల్పోవడమే ఇందుకు కారణం.. దీనికి తోడు డిజిటల్ మీడియాలో విస్తారమైన అవకాశాలు దొరకడంతో చాలామంది అటువైపుగా వెళ్లిపోయారు. దీంతో డెస్క్ లో నాణ్యమైన పాత్రికేయులు లేకుండా పోయారు.. కోవిడ్ సమయంలో చాలా యాజమాన్యాలు జర్నలిస్టులను నిర్దాక్షిణ్యంగా తొలగించాయి.. దీంతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.. ఇదే సమయంలో వారికి డిజిటల్ మీడియా ఆపన్న హస్తం అందించింది. ఒకవేళ అదే గనుక లేకుంటే వారి పరిస్థితి మరింత అగమ్య గోచరంగా ఉండేది.. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ సెంట్రల్ డెస్క్ లో పనిచేసేందుకు జర్నలిస్టులు కావాలని ప్రకటన వేసింది. వేతనం కూడా 30 నుంచి 70 వేల వరకు ఇస్తామని ప్రకటించింది. అయినప్పటికీ ఎవరూ రావడం లేదు. ఉన్నవాళ్లు నిలబడటం లేదు. ఇందుకు కారణం యాజమాన్యాల పోకడ ఒకటైతే, ఈ వృత్తిలో ఎదుగుదల అంతగా లేకపోవడం… వీటివల్లే చాలామంది ముద్రణ పాత్రికేయం వైపు అంతగా ఇష్టం చూపించడం లేదు. కీలక ఉద్యోగులు పోయినంత మాత్రాన దిశ పేపర్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, దాని యాజమాన్యం జబ్బలు చరుచుకోవచ్చు. కాని దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మరుసటి పోటీ పత్రిక ఎడిషన్ చూస్తే గాని అర్థం కాదు.
Also Read: Telangana congress : తెలంగాణ కాంగ్రెస్ ను ముంచేస్తున్నారు