White Hair Treatment: ఆధునిక కాలంలో జుట్టు తెల్లబడటం, రాలిపోవడం సహజమే. మనం తీసుకునే ఆహారాల ప్రభావంతో మన జుట్టు నెరిసిపోతుంది. ఇరవైలోనే పెద్ద వయసు వారిగా కనిపిస్తున్నాం. ఫలితంగా నలుగురిలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నాం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఇబ్బందిగా మారుతోంది. తెల్లబడిన జట్టును కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఏది దొరికితే అది వాడేస్తున్నారు. మార్కెట్లో దొరికే వాటిని వాడుతూ జేబు గుల్ల చేసుకుంటున్నా ఫలితం మాత్రం రావడం లేదు.

ఈ నేపథ్యంలో మన ఇంటిలో కూడా చిట్కాలు ఉపయోగించి జుట్టును నల్లగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం తయారు చేసుకునే చిట్కాలతో జుట్టు పదిహేను రోజుల్లో నల్లబడుతుందని చెబుతున్నారు. జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో గ్లాస్ నీరు పోసి స్పూన్ టీ పొడి రెండు బిర్యానీ ఆకులు ఒక ఉల్లిపాయ వేసి బాగా మరిగించాలి. ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగిస్తే మనం వేసిన తరువాత పోషకాలు అందులోకి చేరతాయి. అప్పుడు ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం కొబ్బరి నూనె కలుుని జుట్టుకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు నల్లగా మారుతుంది.

తలస్నానం చేసిన తరువాత జుట్టుకు దీన్ని పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. ఆ రోజు తలకు షాంపు పెట్టకూడదు. మరుసటి రోజు షాంపు పట్టించొచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం లభించొచ్చు. జుట్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇలా తెల్ల జుట్టును నల్లగా చేసుకునే క్రమంలో పాటించే చిట్కాతో మనకు సైడ్ ఎఫెక్స్ట్స్ కూడా ఉండవు. ఇలా సహజసిద్ధంగా తయారు చేసుకునే విధానంతో మనకు ఎన్నో లాభాలున్నాయి.

మనం వాడుకునే పదార్థాలు మనకు నష్టం చేయవు. వీటిని వాడుకోవడం వల్ల మన జుట్టుకు కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. కొన్నింటిని తీసుకుంటే మన మెదడుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి ఇంటి చిట్కాలు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తెల్ల జుట్టును నల్లగా చేసుకోవడానికి జుట్టు రాలిపోవడాన్ని ఆపడానికి కూడా ఎన్నో మార్గాలు మనకు కనిపిస్తాయి. వాటిని ఇంటి వద్దే తయారు చేసుకుని ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.