https://oktelugu.com/

Pakistan : ఫిబ్రవరి ఎన్నికలు పాకిస్తాన్ లో జరుగుతాయా?

ఇంతటి ఉద్రిక్త వాతావరణంలో ఫిబ్రవరి ఎన్నికలు పాకిస్తాన్ లో జరుగుతాయా? లేదా పాకిస్తాన్ లోని పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2023 / 03:59 PM IST

    Pakistan : పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతోంది. చాలా ఆశ్చర్యకర పరిణామాలు చూడబోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో సైన్యం కూడా వెళ్లలేకపోతోందట.. ఖైబర్ ఫక్తూన్, బెలూచీస్తాన్ లో సైన్యం పైన దాడులే దాడులు జరుగుతున్నాయి.

    పాకిస్తాన్ లోని కొన్ని ట్రైబల్ ప్రాంతాలు, అప్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తాలిబన్లు అధికారంలో ఉన్నట్టు సమాచారం. అప్ఘనిస్తాన్ పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తూ పాకిస్తాన్ లోనూ తమ వాళ్లు ప్రభుత్వంగా ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నారట.. దీంతో పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దెబ్బతిన్నాయట..

    అప్ఘనిస్తాన్ లో తాలిబన్ ముందు ప్రభుత్వంతో కూడా పాకిస్తాన్ కు ఇంతటి శతృత్వం లేదు. అప్ఘనిస్తాన్ కు ఇప్పుడు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ యేనట.. అప్ఘన్ శరణార్థులు అందరినీ పాకిస్తాన్ కట్టుబట్టలతో అప్ఘనిస్తాన్ లోకి పంపిస్తోంది. బాధితులు అందరూ దీనిపై మండిపడుతున్నారు. ఒకనాడు అప్ఘనిస్తాన్ లోనివే ఈ ప్రాంతాలు. తమ ప్రాంతాల నుంచి తమను బయటకు పంపుతారా? అంటూ నిలదీస్తున్నారు. ఉద్యమిస్తున్నారు.

    పాకిస్తాన్-అప్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు అయిన ‘డ్యూరండ్ లైన్’ ను గుర్తించడం.. అప్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం దీన్ని అస్సలు గుర్తించక పాకిస్తాన్ లోని ప్రాంతాలను ఆక్రమించేస్తున్నారు. పాకిస్తాన్ -అప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు చేయిదాటిపోతోంది.

    ఇంతటి ఉద్రిక్త వాతావరణంలో ఫిబ్రవరి ఎన్నికలు పాకిస్తాన్ లో జరుగుతాయా? లేదా పాకిస్తాన్ లోని పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.