ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాటలు వినడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, యూట్యూబ్ వీడియోలు, సినిమాలు చూడటానికి ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. అయితే ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవసరానికి మించి ఇయర్ ఫోన్స్ ను వాడితే చెవి సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ ఏడాది రాబోయే కొత్త ఫీచర్లివే..?
ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగిస్తే నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో పాటు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. వాల్యూమ్ 90 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇయర్ ఫోన్స్ ద్వారా శబ్దం నేరుగా చెవులలోని కర్ణభేరిని తాకుతుంది. అలా జరగడం వల్ల కర్ణభేరి దెబ్బ తినడంతో పాటు మెదడులో కణితలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇయర్ ఫోన్స్ ను పూర్తిగా వాడటం ఆపేయడం లేదా అవసరం ఉన్న సమయంలో మాత్రమే వాడినా మంచిది.
Also Read: బిర్యానీతో రూ.200 కోట్ల వ్యాపారం చేస్తున్న మహిళ.. ఎలా అంటే..?
ఒకవేళ తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ వాడాలనుకుంటే నాసిరకం ఇయర్ ఫోన్స్ కాకుండా బ్రాండెడ్ కంపెనీల ఇయర్ ఫోన్స్ ను వాడితే మంచిది. ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్ వాడితే చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకరు వాడిన ఇయర్ ఫోన్స్ ను ఇంకొకరు వాడకూడదు. ఒకవేళ ఇతరులు వాడిన ఇయర్ ఫోన్స్ ను వాడాల్సి వస్తే ఇయర్ ఫోన్స్ ను శుభ్రం చేసుకొని వాడాలి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
వాహనం నడిపే సమయంలో, షాపింగ్, వాకింగ్, జాగింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు. వాహనం నడిపే సమయంలో ఇయర్ ఫోన్స్ వాడితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.