Dunki Trailer: డంకీ ట్రైలర్ రివ్యూ: షారుఖ్ నుండి ఊహించని చిత్రం, కథలో ట్విస్ట్ అదే!

డంకీ విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి సీన్లో రామ్ కుమార్ హిరానీ మార్క్ కనిపించింది. షారుఖ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సి పన్ను, విక్కీ కౌశల్ కీలక రోల్స్ చేస్తున్నారు. లండన్ వెళ్లాలని కలలు కనే ఐదుగురు మిత్రుల కథ ఇది.

Written By: NARESH, Updated On : December 5, 2023 11:32 am

Dunki Trailer

Follow us on

Dunki Trailer: దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయన ఉన్నారు. రాజ్ కుమార్ తెరకెక్కించిన 3 ఇడియట్స్, పీకే, సంజు వంటి బాక్సాఫీస్ షేక్ చేశాయి. హీరో అమిర్ ఖాన్ కెరీర్లో 3 ఇడియట్స్, పీకే మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి. షారుక్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరానీ ఇంత వరకు మూవీ చేయలేదు. మొదటిసారి వీరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.

డంకీ విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి సీన్లో రామ్ కుమార్ హిరానీ మార్క్ కనిపించింది. షారుఖ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సి పన్ను, విక్కీ కౌశల్ కీలక రోల్స్ చేస్తున్నారు. లండన్ వెళ్లాలని కలలు కనే ఐదుగురు మిత్రుల కథ ఇది.

లండన్ వెళ్లేందుకు వాళ్లకు చాలా అవరోధాలు ఉన్నాయి. ఇంగ్లీష్ రాదు, ఆర్థికంగా బలంగా లేరు. అయితే నిజాయితీగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలితం ఇవ్వవు. దాంతో వారు ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటారు. అక్రమంగా లండన్ కి వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు వారికి అనుకోని సమస్యలు ఎదురవవుతాయి. ఆ సమస్యలు ఏమిటీ? వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? అసలు లండన్ వెళ్లాలనే లక్ష్యం వెనుక కారణం ఏమిటీ? అనేది డంకీ కథ.

డంకీ అంటే అర్థం అక్రమ చొరబాటు. ట్రైలర్ గమనిస్తే ప్రతి సీన్లో హిరానీ మార్క్ కనబడుతుంది. ఎమోషన్, హ్యూమర్ ప్రధానంగా తెరకెక్కించారు. డంకీ డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నుండి వస్తున్న మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాల్లో మాస్, యాక్షన్ హీరోగా ఆయన కనిపించారు. ఆ రెండు చిత్రాలకు పూర్తి విరుద్ధంగా డంకీ ఉంటుంది.