Crying men: ‘ఏడ్చే మొగాళ్లను నమ్మకూడదు..’ ఈ సామెత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇదే సామెతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న సమయంలో కొందరు సోషల్ మీడియాలో కామెంట్లుగా పెడుతున్నారు. అయితే ఏడ్చే మొగాళ్లను ఎందుకు నమ్మకూడదు..? అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. మగవారికి కష్టాలు ఉండవా..? అబ్బాయిలకు కూడా బావోద్వేగాలు ఉంటాయి కదా..? అని విశ్లేషకులు అంటున్నారు. భావోద్వేగాలు కలుగడానికి జెండర్ తో పనిలేదుగా అని అంటున్నారు. పురుషులపై అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. పలు చోట్ల తిరిగే పురుషులు అన్ని పనులు చక్కబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇదే క్రమంలో సమాజం నుంచి ఒక్కోసారీ తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనప్పుడు తనలోని భావోద్వేగం బయటకు వస్తుంది. అలాంటప్పుడు వారు తీవ్రంగా కుంగిపోయి కన్నీళ్లు కారుస్తారు అని శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి లాంటి రచయితలు చెబుతున్నారు.

పురుషులకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. కొన్నింటిని ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి తరుణంలో వారిలోని బావోద్వేగం బయటకు వస్తుంది. ఉదాహరణకు కొందరు పురుషులు లైంగిక సమస్యలు, ఇతర సమస్యలను తొందరగా ఇతరులకు చెప్పలేరు. ఇలాంటి తరుణంలో వారి మనసులోనే కుంగిపోతుంటారు. గతంలో కంటే నేటి కాలంలో పురుషుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇవి 45 సంవత్సరాల లోపు వారిలో ఎక్కువగా ఉంది. మహిళలను పురుషుల గౌరవించాలన్నప్పుడు.. పురుషుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అయితే పురుషులు ఓపిగ్గా తమ సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు యత్నిస్తారు. అందుకే పురుషుల్లో ఓపిక ఎక్కువ అని కొందరు అంటుంటారు.
‘పురుషుల సమస్యలు, బాధలను ఎవరూ పట్టించుకోరని, వినడానికి కూడా ఎవరూ ఇష్టపడరని, అది తమ మనసుల్లో తీవ్ర బాధ కలిగించి వారిలో వారికే విసుగు పుడుతుందని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ అన్నారు. అయితే పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలను, సమస్యలను నివారించేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళలకు ప్రత్యేక దినోత్సవం ఉన్నట్లు పురుషులకు కూడా ఉండాలని నిర్ణయించారు. దీంతో నవంబర్ 19న పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
1991లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని గుర్తించి 1992లో తొలిసారి జరుపుకున్నారు. అయితే టొబాగోల్ వెస్ట్ ఇండీస్ యూనివర్సిటీ నుంచి ఓ లెక్చరర్ 1999 నుంచి వరుసగా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి తగినంత ప్రాచుర్యం కల్పించాలని డేవ్ బార్లో అనే వ్యక్తి పిటిషన్ కూడా వేశారు. ‘ప్రభుత్వ శాఖల్లో మహిళలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు… పురుషులకు ఎందుకు ఉండకూడదు..?’ అని కన్జర్వేటివ్ సభ్యుడు ప్రశ్నించారు. దీంతో పురుషులు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి, అభివృద్ధిని వివరించేందుకు ఓ రోజును కేటాయించాలని నిర్ణయించి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆధునిక యుగంలో మహిళ దినోత్సవం రోజున అనేక సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పురుషుల సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదా..? అన్న చర్చ మొదలవుతోంది. మహిళలకు ఓ రోజు కేటాయించినప్పుడు.. పురుషులకు కూడా ఓ రోజు ఉండాలని ప్రముఖ రచయిత లావణ్య తెలిపారు. అయతే భారతదేశంలో పురుషుల దినోత్సవానికి అంతగా ప్రాధాన్యం లేదు. దీనిని చాలా మంది వాణిజ్య కోణంలో చూస్తున్నారు. కానీ అబ్బాయికు కూడా అనేక సమస్యలు ఉంటాయి. వాటిని ఇతరులకు పంచుకోవడానికి ఓ రోజు ఉండాలని అంటున్నారు. పితృస్వామ్య విలువలు మహిళలకు ఎంత చేటు చేస్తాయో..పురుషులకు కూడా అంతే ఉంటాయని అంటున్నారు. అయితే ఇలాంటి దినోత్సవాలు మంచివేనని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అంటున్నారు.