AP rains: ఆంధ్రప్రదేశ్ లో వర్షబీభత్సం సృష్టిస్తోంది. వరదల ధాటికి అనేక ప్రాంతాలు కకావికలం అవుతున్నాయి. కడప జిల్లా రాజంపేటలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రాణనష్టం కూడా పెద్దమొత్తంలోనే జరుగుతోంది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోతోంది. ప్రజల ప్రాణాలు పోతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్షాలు పేర్కొంటున్నాయి. గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో నష్టం భారీగానే చోటుచేసుకుంటోంది.

తిరుపతిలో కూడా వరద ప్రభావం కొనసాగింది. అనేక గ్రామాలు జల దిబ్బంధంలోనే చిక్కుకున్నాయి. అయినా సీఎం జగన్ మాత్రం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులు తీరడం లేదు. తాడేపల్లి నుంచే సమీక్షలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రజల బాధలు పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాలు ఇంకా కష్టాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజల కష్టాలు తీర్చాల్సిన అధికార యంత్రాంగం సైతం కనిపించడం లేదు. దీంతో ప్రజల ఇక్కట్లు తీరడం లేదు. నిత్యావసర వస్తువులు అందడం లేదు. చుట్టుపక్కల నీటితో గ్రామాలన్ని చెరువులను తలిపిస్తున్నాయి. శిబిరాల్లోని వారికి రూ.2 వేలు, ప్రాణనష్టం జరిగితే రూ. 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అవి వారికి చేరడం లేదని తెలుస్తోంది. దీంతో జనం వరద బురదలోనే కాలం వెళ్లదీయాల్సిన అగత్యం ఏర్పడింది.
Also Read: Pawan Kalyan: చంద్రబాబు ఏడుపుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదీ!
వరదలో చిక్కుకుని ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందని బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులు గానీ నాయకులు కాని కనిపించడం లేదు. ఫలితంగా ప్రజల సమస్యలు తీరడం లేదు. వరదలోనే చిక్కుకుని అల్లాడుతున్నారు. పుల్లూరు, మందపల్లి, పులత్తూరు గ్రామాల్లో యాభై మంది చనిపోయినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. దీంతో వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల బాధలు తీర్చాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: Chandrababu: చంద్రబాబు కన్నీళ్లకు తెలుగు తమ్ముళ్ల ప్రతీకారమా?