సాధారణంగా మనం పూజ చేసే సమయంలో ఆ దేవ దేవతలకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తాము. ఏ పూజ చేసినా అందులో పువ్వులను తప్పకుండా ఉపయోగిస్తాము. మనం భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఫలమైన పుష్పాన్నైనా సమర్పించిన స్వామి వారు ప్రీతి చెంది నైవేద్యంగా స్వీకరిస్తారని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. ఎంతో మహిమగల భగవద్గీతలో పువ్వుల గురించి ప్రస్తావన రావడంతోనే ఈ పువ్వులకు పూజలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో పువ్వులను సమర్పించే విషయంలో కూడా కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. పొరపాటున కూడా పువ్వుల విషయంలో ఈ తప్పులు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు.
Also Read: శయనిస్తున్న దర్శనం కల్పించే శివుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..?
దేవుడు సమర్పించే పువ్వులు ఎల్లప్పుడూ ఎంతో సువాసన భరితమైన పుష్పాలను పెట్టాలి. అదేవిధంగా పూజ చేసేవారు శుభ్రతతో, స్వచ్ఛమైన మనసుతో స్వామివారికి పుష్పాలను సమర్పించినప్పుడు మాత్రమే స్వామివారు ప్రీతి చెందుతాడు. మైల అయినవారు, పురిటి స్త్రీలు, బహిష్టు అయిన వారు స్వామివారికి పువ్వులను పెట్టకూడదు. అటువంటి వారు తాకిన పుష్పాలు దేవుని పూజకు పనికిరావు. అదేవిధంగా వాసన చూసిన పుష్పాలు, భూమిపై పట్టిన పువ్వులను కూడా దేవునికి సమర్పించరాదు.
Also Read: బియ్యపుపిండితో ముగ్గు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
కొన్ని పుష్పాలు ఎంతో చెడు వాసనను వెదజల్లుతుంటాయి. అలాంటి పుష్పాలు, ముల్లును కలిగి ఉన్న పువ్వులను దేవుడికి పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే దేవుడికి ఎక్కువగా తామరపువ్వులు, కలువ పువ్వులు, పారిజాత, నందివర్ధనం, చామంతి, మందార వంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెందుతారని పండితులు తెలియజేస్తున్నారు. అదే విధంగా స్త్రీలు పొరపాటున కూడా తులసీ దళాలను తమ జడలో పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు.పూజ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా భక్తిశ్రద్ధలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం