ఆంధ్రా బంద్: ‘విశాఖ ఉక్కు’ కోసం.. కదిలిన దండు..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సహా అన్ని పార్టీలు, ప్రజా , కార్మిక సంఘాలు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఏపీ వ్యాప్తంగా బంద్ ఉధృతంగా సాగుతోంది. ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటించడం రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచి […]

Written By: NARESH, Updated On : March 5, 2021 8:38 am
Follow us on

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సహా అన్ని పార్టీలు, ప్రజా , కార్మిక సంఘాలు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అందుకే ఏపీ వ్యాప్తంగా బంద్ ఉధృతంగా సాగుతోంది.

ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటించడం రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచి డిపోల నుంచి కదల్లేదు. ప్రభుత్వ ఆఫీసులు తెరవడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బంద్ లో పాల్గొంటున్నాయి.

పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక లారీ యజమానుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్ కు మద్దతునిచ్చాయి. బంద్ ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ అసోసియేషన్ ప్రకటించింది.

గత ఐదురోజులుగా ఏపీలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్ ను విజయవంతం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు ఈ బంద్ కు సంఘీభావం ప్రకటించాయి. వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు మద్దతు పలకారు.