సర్వే: వైసీపీకే కార్పొరేషన్లు, టీడీపీ, బీజేపీ-జనసేన పరిస్థితిదీ

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల వేళైంది. పంచాయతీల్లో వైసీపీ దున్నేయగా.. ప్రధాని ప్రతిపక్షం టీడీపీకి షాకిస్తూ జనసేన దూసుకొచ్చింది. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేంతగా సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలను గెలుచుకుంది. మరి ఈ ఊపు మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతుందా? మున్సిపోల్స్ లో గెలుపు ఎవరిది? అనే దానిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ సర్వే నిర్వహించినంది. ఆ సర్వే […]

Written By: NARESH, Updated On : March 5, 2021 12:17 pm
Follow us on

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల వేళైంది. పంచాయతీల్లో వైసీపీ దున్నేయగా.. ప్రధాని ప్రతిపక్షం టీడీపీకి షాకిస్తూ జనసేన దూసుకొచ్చింది. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేంతగా సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలను గెలుచుకుంది. మరి ఈ ఊపు మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతుందా? మున్సిపోల్స్ లో గెలుపు ఎవరిది? అనే దానిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ సర్వే నిర్వహించినంది. ఆ సర్వే ప్రకారం ఏ యే కార్పొరేషన్లలో ఏయే పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏయే పార్టీ లీడ్ సాధిస్తుంది..? అనే అంశాలను తెలిపింది..

ఆత్మసాక్షి గ్రూప్..ఈ సంస్థ ఇటీవల ఏపీలోని మున్సిపల్ ఎన్నికలపై సర్వే నిర్వహించి పార్టీల పోజిషన్ ఎలా ఉందో తెలిపింది. రాష్ర్టంలోని 12 కార్పొరేషన్లలో 2 విడుదలుగా సర్వే చేసినట్లు సంస్థ ప్రతినిధి మూర్తి తెలిపారు. జనవరి 17 తేదీ నుంచి ఫిబ్రవరి 3 మొదటివిడుతగా..ఫిబ్రవరి 6 నుంచి అదే నెల 15 వరకు రెండో విడతగా సర్వే చేశారు. ఇందులో యువకులు, నిరుద్యోగ యువకులు, 45 సంవత్సరాల పై బడ్డ వయసుగలవారిని చేర్చారు. అలాగే ఉద్యోగస్తులు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇక మహిళలను 3 విభాగాలు విభజించి సర్వే చేశారు. సర్వేలో ఓటర్లను సివిల్ సప్లయ్, ఇంటింటికి రేషన్, నవరత్నాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ప్రశించారు.

సర్వే చేసిన తరువాత వచ్చిన ఫలితాలను వివరించారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న వైసీపీకి 4.5 నుంచి 5 శాతం, టీడీపీ 7నుంచి 8.5 శాతం తగ్గింది. ఇదే సమయంలో బీజేపీ,జేఎస్పీ 6.8 శాతం ఓటింగ్ పెంచుకొని మొత్తంగా రెండు పార్టీలు కలిసి 14.3 శాతం దక్కించుకున్నాయి. కాగా ఈ సర్వేలో తటస్థంగా ఉన్నవారు 10.5 శాతం ఉన్నారు.

ఇక కార్పొరేషన్ల వారీగా చూస్తే తిరుపతి, కడప, కర్నూలు, చిత్తూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం, ఒంగోలు కార్పొరేషన్లలో వైసీపీ విజయం ఖాయమని సంస్థ తెలుపుతోంది. విజయవాడ, విఖాఖపట్నం, విజయనగరం, ఏలూరు కార్పొరేషన్లలో అధికార పార్టీ కీన్ కాంటెస్ట్ జరగనుంది. అయితే స్పల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

గణాంకాల ప్రకారం చూస్తే.. వైసీపీకి తిరుపతిలో 40, కడపలో 46, కర్నూలు 41, ఏలూరు 32, చిత్తూరు 42, మచిలీపట్నం37, గుంటూరు 36, అనంతపురం 38, విజయనగరం 35, ఒంగోలు 41, విజయవాడ 30-31, విశాఖపట్నం 51-53 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి తిరుపతిలో 4, కడపలో 2, కర్నూలు 7, ఏలూరు 8, చిత్తూరు 6, మచిలీపట్నం 7, గుంటూరు 6, అనంతపురం 7, విజయనగరం 11, ఒంగోలు 3, విజయవాడ 17-20, విశాఖపట్నం 7-8 స్థానాలు చ్చే అవకాశం ఉన్నాయని ఆత్మసాక్షి గ్రూప్ తెలిపింది.