Samantha Life: సమంత తన జీవితంలో సావిత్రిని ఆదర్శంగా తీసుకుందా?

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాలో సమంత ముఖ్య పాత్రలో కనిపించింది. ఆ సినిమా విడుదలైన టైంలో సమంత ఒకవేళ తను కొన్ని నిర్ణయాలు తీసుకో ఉండకపోతే తన జీవితం కూడా సావిత్రి లాగా అయిపోయి ఉంటుందని చెప్పడం విశేషం.

Written By: Swathi, Updated On : July 26, 2023 3:18 pm

Samantha Life

Follow us on

Samantha Life: మహానటి సావిత్రి జీవితం తీసుకుంటే అందులో మనం నేర్చుకోగలిగే పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఆమె మంచి అనుభవాల నుంచి నేర్చుకుంటే మరికొన్నేమో ఆమె చెడు అనుభవాల నుంచి నేర్చుకోగలిగేవి. తనని తాను లెక్కచేయకుండా పక్కన వాళ్ళకి సహాయం చేసేది సావిత్రి. తనది ఎంతో దానగుణం అని ఎంతోమంది ఎన్నోసార్లు ప్రశంసించారు. అయితే అలాంటి సావిత్రికి కొంచెం మొండితనం ఎక్కువే.

తను అనుకున్నది జరగాలి అని, ఏదైనా చేసేదట సావిత్రి. ఆత్మ అభిమానం ఎక్కువగా ఉండే ఈ హీరోయిన్ అందువలనే ఎన్నో సమస్యల్లో కూడా చిక్కుకుంది అని ఇప్పటికీ తనతో పరిచయం ఉన్న ఆ కాలం హీరో హీరోయిన్లు చెబుతూ ఉంటారు. అంతేకాదు జమున మరియు నాగేశ్వరరావు లాంటి వారు కూడా సావిత్రిని కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దు అని హెచ్చరించిన ఆమె వినలేదంట.

అయితే అలాంటి సావిత్రికి ఇప్పుడు మన హీరోయిన్ సమంతకి చాలా దగ్గర పోలికలు కనిపించక మానవు. సావిత్రి ప్రేమించి జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకుంటే మన సమంత నాగచైతన్య ని పెళ్లి చేసుకుంది. మొదట్లో ప్రేక్షకులకు ఎంత అందంగా కనిపించిన ఈ రెండు జంటలు పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విడిపోయారు. విడిపోవడానికి సావిత్రికి మరియు సమంతా కి కారణాలు వేరు కావచ్చు కానీ ఆ తరువాత వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరి మధ్య ఉన్న దగ్గర పోలికలు మనకు చూపించక మానవు.

జెమినీ గణేషన్ తో విడాకులు తీసుకున్న తర్వాత సావిత్రి ఆయన పైన పంతంతోనే మూగమనసులు సినిమాని రీమేక్ చేయడం మొదలుపెట్టింది. ఈ పాయింట్ మనకు మహానటి సినిమాలో కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించారు. ఇక సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న వెంటనే పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ లో చేసింది. ఈ సాంగ్ విడుదలకు ముందే ప్రేక్షకులు సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది అని విని అనేక విమర్శలు చేశారు. ఇక ఈ పాట వీడియో రిలీజ్ అయ్యాక అక్కినేని అభిమానులు ఒక స్థాయికి మించి సమంతా పైనే తప్పు మొత్తం మళ్ళించారు. ఇలా చేసినందుకే నాగచైతన్య వదిలేశారు అని కూడా విమర్శలు చేశాడు.

అయితే సమంత విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్య పైన కోపంతోనే ఇలాంటి పాట చేసింది అని అనుకున్న వారు కూడా లేకపోలేదు. ఈమధ్య ఇంటర్వ్యూలో కూడా సమంత అప్పట్లో విడాకులు తర్వాత ఇలాంటి సాంగ్ చేస్తాను అంతే ఎవరూ వద్దన్నారని కానీ తను చేశాను అని చెప్పుకొచ్చింది.

అంతే సావిత్రి ఎలా అయితే జెమినీ పైన కోపంతో మూగమనసులు సినిమా చేయాలి అనుకునిందో అలానే సమంత కూడా నాగచైతన్య పైన కోపంతో ఇలా ఈ సాంగ్ చేసి ఉండొచ్చు. అంతేకాదు ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు విడాకుల తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న కొంచెం కూడా తడబడలేదు.

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాలో సమంత ముఖ్య పాత్రలో కనిపించింది. ఆ సినిమా విడుదలైన టైంలో సమంత ఒకవేళ తను కొన్ని నిర్ణయాలు తీసుకో ఉండకపోతే తన జీవితం కూడా సావిత్రి లాగా అయిపోయి ఉంటుందని చెప్పడం విశేషం. అయితే ఆ మాట సమంత ఎందుకు అనింది అంటే అప్పట్లో సమంత సిద్ధార్థ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. అయితే సిద్ధార్థ్ కి కూడా జెమినీ గణేషన్ లాగా ఎంతోమంది హీరోయిన్లతో రిలేషన్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇది తెలిసి సమంత సిద్ధార్థ తో రిలేషన్ బ్రేక్ చేసుకుంది. అయితే బ్రేక్ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే తన లైఫ్ కూడా మరో సావిత్రి అయ్యుండేది అని సిద్ధార్థ పేరు చెప్పకుండా చెప్పుకొచ్చింది సమంత. అయితే జెమినీ గణేషన్ లాంటి సిద్ధార్థ్ ని సమంత వదిలింది కాబట్టి తన జీవితం బాగానే ఉంటుంది అనుకున్నారు అందరూ. కానీ అది అయితే జరగలేదు. అంతేకాదు నాగచైతన్య కి ఒక హీరోయిన్ తో రిలేషన్షిప్ ఉండడం వల్లే సమంత విడాకులు తీసుకుంది అని కూడా వార్తలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆఖరికి సావిత్రి మరియు సమంతా తమ భర్తల నుంచి విడిపోవడానికి కారణం కూడా ఒకటే అవుతుంది.

ఇక మంచి పనుల విషయానికి వస్తే కూడా సావిత్రిలానే సమంతా కి దానా గుణం ఎక్కువ. ప్రత్యూష అనే ఫౌండేషన్ నడుపుతూ ఎన్నో సహాయక పనులు చేస్తోంది ఈ హీరోయిన్. అంతేకాకుండా తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి తప్పకుండా చేసి తీరుతుంది అనే పేరు కూడా సమంతకి ఉంది. ఇక చిన్నతనంలో సావిత్రి ఎలా అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనిందో అలానే సమంత కూడా ఎన్నో ఎదుర్కొంది. తాను పెళ్ళిలో వచ్చి పోయే వారికి పన్నీరు చల్లుతూ రోజంతా నిలబడుకుంటే 500 రూపాయలు ఇచ్చేవారు అని కూడా సమంత చెప్పుకొచ్చింది. అలాంటి ఇబ్బందులు చూశారు కాబట్టే సమంతకి మరియు సావిత్రి కి పక్కన వారికి సహాయం చేసే గుణం వచ్చిందేమో.

ఇలా చెప్పుకుంటూ పోతే సావిత్రి మరియు సమంతా మధ్యలో మనకు ఎన్నో పోలికలు కనిపించక మానవు. అయితే సావిత్రి లాగా కుంగిపోయి తన జీవితం పతనం చేసుకోకుండా, ప్రస్తుత జనరేషన్ కి చెందిన సమంత, ఒక హీరో లాగా పోరాడి మంచి స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.