Anand Mahindra: వృద్ధ ఇంజినీర్ ఆవిష్కరణ భళా.. ఆయన తయారు చేసిన సైకిళ్లపై ఆనంద్ మహీంద్ర ఫిదా.. బంపర్ ఆఫర్!

గుజరాత్‌కు చెందిన సుధీర్ భావే ఓ ఉక్కు పరిశ్రమలో 40 ఏల్లు పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన విధుల్లో ఉన్నప్పటి నుంచే ప్రత్యేకమైన సైకిళ్ల రూపకల్పనను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తన అభిరుచి మేరకు సైకిళ్లు తయారు చేశాడు. ఇప్పటికే అనేక మోడల్స్‌లో సైకిళ్లు తయారు చేశాడు. ఈ విషయం మహీంద్రా గ్రూప్‌ చైర‍్మన్‌ ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఆయన సుధీర్‌ భావే నైపుణ్యం గురించి తెలుసుకున్నాడు.

Written By: Raj Shekar, Updated On : July 19, 2024 5:51 pm

Anand Mahindra

Follow us on

Anand Mahindra: గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధ ఇంజినీర్‌ తయారు చేసిన వివిధ మోడళ్ల సైకిళ్లు ప్రాముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాను ఆకర్షించాయి. ఈమేరకు సదరు ఇంజినీర్‌ తయారు చేసిన సైకిళ్లకు సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ లో పోస్టు చేశారు. దీనిలో గుజరాత్‌కు చెందిన వృద్ధ ఇంజినీర్‌ ప్రత్యేకమైన డిజైన్‌లను కలిగి ఉన్న సైకిళ్ల తయారీకి సంబంధించి తనకు ఉన్న అభిరుచిని వివరించారు.

ఎవరీ వృద్ధ ఇంజినీర్‌..
గుజరాత్‌కు చెందిన సుధీర్ భావే ఓ ఉక్కు పరిశ్రమలో 40 ఏల్లు పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన విధుల్లో ఉన్నప్పటి నుంచే ప్రత్యేకమైన సైకిళ్ల రూపకల్పనను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తన అభిరుచి మేరకు సైకిళ్లు తయారు చేశాడు. ఇప్పటికే అనేక మోడల్స్‌లో సైకిళ్లు తయారు చేశాడు. ఈ విషయం మహీంద్రా గ్రూప్‌ చైర‍్మన్‌ ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఆయన సుధీర్‌ భావే నైపుణ్యం గురించి తెలుసుకున్నాడు. ఈమేరకు ఇప్పటి వరకు ఆయన తయారు చేసి కొన్ని మోడల్ల సైకిళ్ల గురించి ఓ వీడియో తయారు చేయించారు. దానిని తన ఎక్‌ ఖాతాలో పోస్టు చేసిన ఆనంద్‌ మహీంద్రా ఆయన గురించి ఇలా రాసుకొచ్చాడు.. సుధీర్ భావే అణచివేయలేని సృజనాత్మకత శక్తికి నేను నమస్కరిస్తున్నాను. భారతదేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ డీఎన్‌ఏ అనేది యువతకు మాత్రమే ప్రత్యేక హక్కు కాదని సుధీర్ నిరూపించాడు! సుధీర్, నువ్వు ‘రిటైర్డ్ కాదు.’ మీరు మీ జీవితంలో అత్యంత చురుకైన, వినూత్నమైన కాలంలో ఉన్నారు” అని మహీంద్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

సుధీర్‌కు బంపర్‌ ఆఫర్‌..
ఇదే సమయంలో ఆనంద్‌ మహీద్రా రిటైర్డ్‌ ఇంజినీర్‌ సుధీర్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చారు. ‘మీరు మీ ప్రయోగాల కోసం మా వడోదర ఫ్యాక్టరీ యొక్క వర్క్‌షాప్‌ని ఉపయోగించాలనుకుంటే, నాకు తెలియజేయండి’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు జోడించిన వీడియోలో సుధీర్‌ భావే తన వినూత్నమైన డిజైన్‌లను కలిగి ఉన్న సైకిల్‌లను తయారు చేయడం గురించి వివరించాడు. భావే, రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్, అనేక చక్రాలను సవరించారు, వాటిలో కొన్ని వ్యాయామాలకు కూడా ఉపయోగపడతాయి. భావే అటువంటి రెండు చక్రాల వినియోగాన్ని కూడా ప్రదర్శించాడు, అవి లోపల రోలర్‌లను కలిగి ఉంటాయి. ఎగువ శరీర వ్యాయామానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మీరు మాన్యువల్‌గా కూడా నడపగలిగే ఎలక్ట్రికల్ సైకిల్‌ను కూడా తయారు చేశాడు.

భావే అభిప్రాయం…
ఇక తన ప్రయోగాలపై పని చేయడానికి అవసరమైన సమయం గురించి సుధీర్‌ మాట్లాడుతూ తనకు స్వంత వర్క్‌షాప్ లేదు. వర్క్‌షాప్‌లు ఉన్న యజమానులు నాకు కేటాయించవచ్చని చెప్పినప్పుడు నేను ఇతర వర్క్‌షాప్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక సైకిల్‌పై పనిపూర్తి చేయడానికి దాదాపు ఒక నెల పడుతుంది. నాకు నిర్దిష్టమైన లక్ష్యం లేదు. నేను, నా కార్యకర్త సమయం దొరికినప్పుడల్లా ఒక ప్రాజెక్ట్‌ను చేపడతాము’ అని పేర్కొన్నాడు.