https://oktelugu.com/

శివుడికి విభూతి అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా..?

త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. శివుడినిఅభిషేక ప్రియుడని, అలంకార ప్రియుడని చెబుతుంటారు. అయితే శివుడికి అభిషేకం నిర్వహించే సమయంలో విభూతితో కూడా అభిషేకం నిర్వహిస్తుంటారు.అదేవిధంగా శివ భక్తులు ఎక్కువగా శరీరం మొత్తం విభూది అంటించుకుని ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా శివ భక్తులు విభూతిని అనిపించుకోవడానికి గల కారణం ఏమిటి? శివుడికి విభూతి అంటే ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇక్కడ తెలుసుకుందాం… Also Read: శివుని ప్రసన్నం కొరకు మహిళ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2021 / 10:22 AM IST
    Follow us on

    త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. శివుడినిఅభిషేక ప్రియుడని, అలంకార ప్రియుడని చెబుతుంటారు. అయితే శివుడికి అభిషేకం నిర్వహించే సమయంలో విభూతితో కూడా అభిషేకం నిర్వహిస్తుంటారు.అదేవిధంగా శివ భక్తులు ఎక్కువగా శరీరం మొత్తం విభూది అంటించుకుని ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా శివ భక్తులు విభూతిని అనిపించుకోవడానికి గల కారణం ఏమిటి? శివుడికి విభూతి అంటే ఎందుకు అంత ప్రీతికరమైనదో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: శివుని ప్రసన్నం కొరకు మహిళ సజీవ సమాధి.. చివరకు..?

    లోక సంరక్షణార్ధం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సాగరమధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి పలు రకాల వస్తువులు ఉద్భవిస్తాయి. ఈ వస్తువులన్నింటిని ఒక్కొక్కరు పంచుకుంటారు.ఈ క్రమంలోనే సముద్రం నుంచి కాలకూట విషం బయటపడుతుంది. ఈ విషాన్ని ఎవరో ఒకరు సేవించే వరకు సముద్రగర్భం నుంచి అమృతం బయటకు రాదు. దేవతలు రాక్షసులు ఈ విషాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ విషాన్ని సేవిస్తాడు.

    Also Read: పెళ్లిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

    శివుడు ఆవిషాన్ని తాగితే మరణం తప్పదని భావించి ఆ విషాన్ని కంఠంలోనే ఉంచుకుంటాడు. ఈ విధంగా విషాన్ని కంఠంలో ఉండటం వల్ల గొంతు అంతా నీలి రంగులోకి మారి ఎంతో మంటగా ఉంటుంది. విషం వల్ల వేడెక్కిన శరీరానికి చల్లదనం కోసం శివుడు కంఠానికి, శరీరానికి విభూదిని రాస్తారు. విభూది రాయడం వల్ల శివుడి కంఠం, శరీరం చల్లబడిందని అప్పటినుంచి శివుడికి విభూధిని రాయడం, విభూదితో పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. శివ భక్తులు సైతం శరీరం మొత్తం విభూదిని రాసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం