https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్: ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా యంగ్ హీరో !

త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉండాలి. అందుకే, ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీని భారీగా ప్లాన్ చేశాడు. అందుకే, ఈ సినిమాలో చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడట. ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ […]

Written By:
  • admin
  • , Updated On : February 12, 2021 / 10:17 AM IST
    Follow us on


    త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉండాలి. అందుకే, ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీని భారీగా ప్లాన్ చేశాడు. అందుకే, ఈ సినిమాలో చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడట. ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని.. దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ కావాలని, అందుకే త్రివిక్రమ్ నవీన్ వైపు మొగ్గు చూపాడట.

    Also Read: సినిమాల వల్లే నా భార్య నాకు విడాకులిచ్చింది.. ప్రముఖ నటుడి ఆవేదన

    అన్నట్లు ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సునీల్ ఒకప్పుడు తెలుగు తెర పై నవ్వులు పూయించిన గ్రేట్ కమెడియన్స్ లో ఒకరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగి ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారి ‘మర్యాద రామన్న’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు. చివరకు ప్లాప్స్ కారణంగా మళ్ళీ కమెడియన్ గా మారాడు అనుకోండి. అయితే తన మిత్రుడు డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కనిపించబోతున్నాడు.

    Also Read: నితిన్ ‘చెక్’ బేరం అదుర్స్.. విడుదలకు ముందే లాభాలు

    మరి సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా ? ‘కలర్ ఫోటో’ సినిమాతో తనలోని విలన్ కోణాన్ని చూపించినా సునీల్ ఆ సినిమాలో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెడతాడని, నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా బఫూన్ అవుతున్నారనే విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని నడిపిస్తాడని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్