Female Tollywood Producers: సినీ రంగంలో రాణించడమంటే ఆషామషీ కాదు. నటుడిగా ఒక్కఛాన్స్ కోసం ఎంతో మంది.. ఎన్నో కష్టాలు పడ్డారు. అలాంటిది నిర్మాతలుగా రాణించడమంటే కత్తిమీద సామే. ఒక సినిమాను పూర్తి చేయాలంటే లైట్ మెన్ నుంచి డైరెక్టర్ వరకు అంతా నిర్మాతదే బాధ్యత. ప్రతీ విషయం నిర్మాత పక్కగా ప్లాన్ చేసుకుంటేనే సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి.. శ్రమ పడి సినిమా పూర్తి చేస్తే లాభాలు రావచ్చు.. రాకపోవచ్చు.. నష్టం వస్తే మాత్రం తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి లేని చాలా మంది ప్రాణాలను కూడా విడుచుకున్నారు. ఇంతటి కష్టమైన పనిని టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది అందమైన మహిళా మణులు బాధ్యతతో వ్యవహరిస్తూ నిర్మాతగా రాణిస్తున్నారు. మరి వారి గురించి తెలుసుకుందామా.
ప్రియాంక దత్:
ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆయన వారసత్వాన్ని కూతురు ప్రియాంక దత్ తీసుకున్నారు. తండ్రి సినిమా నిర్మాత కావడంతో తాను నటించడం కంటే నిర్మాతగా రాణించడమే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె ముంబయ్ లో ఓ డైరెక్టర్ దగ్గర పనిచేసిన ఆమె 2009లో ‘త్రి ఏంజెల్స్ ’ స్టూడియోతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత ‘స్వప్న’ బ్యానర్ పై ‘బాణం’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలు నిర్మించారు. వీటిలో మహానటి పలు జాతీయ అవార్డులు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
నీలిమాగుణ:
ఒకప్పుడు సక్సెస్ సనిమాలకు కేరాఫ్ గా నిలిచిన గుణశేఖర్ గురించి తెలియనివారుండరు. గుణ శేఖర్ సినిమాలతో మహేష్ బాబు, తదితర నటుల జీవితాలు మారిపోయాయి. అయితే ఇటీవల ఆయన దూకుడు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కూతురు నిలిమా గుణ ను మాత్రం నిర్మాతగా పరిచయం చేశారు. ఇటీవల రిలీజైన ‘శాకుంతల’ మూవీకి నీలిమా గుణ నే నిర్మాత. అయితే ఈ మూవీ ప్లాన్ టాక్ తెచ్చుకుంది.
హన్షిత రెడ్డి:
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు అంటే చాలామందికి గౌరవమే. ఆయన సినిమాలకు ఓ బ్రాండ్ ఏర్పడింది. చాలామంది నటులు దిల్ రాజు నిర్మాత అనగానే నటించడానికి ముందుకు వస్తుంటారు. కొత్త కథలను ఎంపిక చేయడంలో దిల్ రాజు ముందుంటారని అంటారు. ఆయన కూతురు హన్షిత రెడ్డి తండ్రి బాటలోనే నిర్మాతగా మారారు. ఆమె దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థకు ఫౌండర్ గా ఉన్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘బలగం’ మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే.
సుస్మిత కొణిదెల:
మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ తో ఆమె పలు వెబ్ సిరీసులు తీశారు. ముందుగా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారారు. ఆమె ఆధ్వర్యంలో ‘సేనాపతి’, ‘షూట్ఖ అవుట్ ఎట్ అలేర్’ అనే సీరీస్ లు విడుదలయ్యాయి.
ప్రసీద:
సీనియర్ నటుడు కృష్ణం రాజుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ప్రసీద ఒకరు. తండ్రి సినిమాల్లో ఉన్నంత కాలం ఆమెకు ఇండస్ట్రీ పై ఆసక్తి పెరిగింది. అయితే నటన కంటే నిర్మాణ రంగంపైనే ఆమె ఇంట్రెస్ట్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
కరుణ:
టాలీవుడ్ లో దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరున్న నట్టి కుమార్ గురించి తెలియని వారుండరు. ఆయన కుమార్తె కరుణ తండ్రిబాటలోనే రాణిస్తున్నారు. ఆమె తన సొంత బ్యానర్ లో పలు సినిమాలు తీశారు. వీటిలో ‘దెయ్యంతో సహజీవనం’ అనే మూవీలో ఆమె కనిపిస్తారు కూడా.
ఒకప్పుడు సావిత్రి, కృష్ణవేణి, భానుమతిలు నిర్మాణ రంగంలో రాణించి తమదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు యువ మహిళా మణులు కొత్త కథలతో సినిమాల తీస్తూ ప్రేక్షకులు ఆకట్టుకుంటున్నారు.