Divya Vani Shocking Comments on TDP Leaders : టీడీపీలో సినీ రంగం నుంచి వచ్చిన మహిళా నటీమణులు అస్సలు ఇమడడం లేదు. ఇప్పటికే రోజా, జయప్రద, జయసుధ లాంటి ఎందరో టీడీపీలో చేరి ఆ తర్వాత ఇతర పార్టీల్లోకి మారిపోయారు. ఇప్పుడు అదే కోవను అనుసరించింది దివ్యవాణి. మొన్నీ మధ్యనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి అనంతరం డిలీట్ చేసి అయోమయానికి గురైన దివ్యవాణి.. నేడు అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం టీడీపీలో తనకు జరిగిన అవమానాన్ని పూసగుచ్చినట్టు వివరించి… టీడీపీ లూప్ హోల్స్ అన్నీ బయటపెట్టి పరువు తీశారు.

ఎన్నో తర్జనభర్జనలు.. నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పేసింది దివ్యవాణి. అంతటితో ఆగితే కథ సుఖాంతం అయ్యేది. కానీ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీని ఏకిపారేసింది. టీడీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది. టీడీపీలో అసలు ఎవరూ పట్టించుకోరన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.
తాను జనార్ధన్ కు కాల్ చేస్తే అచ్చెన్నాయుడిని కలవమన్నారని.. ఆయనను అడిగితే మల్యాద్రిని కలవమన్నారని.. ఇలా అందరూ కుక్కపిల్లలా తనను తిప్పారని దివ్యవాణి ఆరోపించారు. ఎంతో మంది చెప్పినా వినకుండా టీడీపీలో చేరానని.. వారు అన్నట్టే తనను కరివేపాకులా తీసివేశారని హెచ్చరించారు.
కేఏ పాల్ టీడీపీకి ఎన్ని కోట్లో రూపాయలు ఇచ్చాడో చెప్పాడని.. నేను ఏమీ అనకున్నా నన్ను తప్పుపట్టారని దివ్యవాణి ఆరోపించారు. ‘పార్టీ లేదు బొక్కా లేదు ’ అన్నవాళ్లను ఏం చేశారని పరోక్షంగా అచ్చెన్నాయుడి గురించి దివ్యవాణి సెటైర్లు వేశారు. చంద్రబాబు భార్యను తిడితే తాను కౌంటర్ ఇచ్చానని.. కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని దివ్యవాణి మండిపడ్డారు.
టీడీపీలో తనకు జరిగిన అవమానంపై.. చంద్రబాబు చేసిన అన్యాయంపై.. పార్టీలో జరుగుతున్న దారుణాలను దివ్యవాణి ఏకరువు పెట్టారు.తను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్కటపడితే తనను హీనంగా చూశారని నిప్పులు చెరిగారు దివ్యవాణి. గౌరవం లేని చోట ఉండనంటూ మీడియా సాక్షిగా టీడీపీకి దివ్యవాణి గుడ్ బై చెప్పారు. రాజకీయాల్లో డబ్బులు తీసుకొని మేకప్ వేసుకునే రకం కాదని దివ్యవాణి అన్నారు. మహానాడులో జరిగిన అవమానాన్ని బయటపెట్టి దివ్యవాణి కడిగిపారేశారు. ఇలా దివ్యవాణిలో ఆవేశం, ఆగ్రహం అంతా గూడుకట్టుకొని బయటకు వచ్చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
[…] Also Read: Divya Vani TDP : టీడీపీలోని ఆడవాళ్ల ఆర్తనాదాలు… […]