Geetu Royal: రాయలసీమ యాసతో.. అచ్చం ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చేసినట్టు టిక్ టాక్ లో చేస్తూ పాపులర్ అయిన సోషల్ మీడియా సెన్షేషనల్ ‘గలాటా గీతూ’. ఈమె జబర్ధస్త్ లో హైపర్ ఆది స్కిట్ లోనూ ‘పుష్ప’ స్ఫూఫ్ చేసి పాపులర్ అయ్యింది. ఆమధ్య టిక్ టాక్ వీడియోలు, తర్వాత బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయ్యింది.

చిత్తూరు యాసలో గలగలా మాట్లాడే ఈ రాయలసీమ చిన్నది ‘గలాటా గీతూ’గా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె తనకు సినీ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు పంచుకుంది. అవిప్పుడు వైరల్ గా మారాయి. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఒక మేనేజర్ పర్సనల్ కలవమని అన్నాడని సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ఈమె బాంబు పేల్చింది.
అల్లు అర్జున్ అంటే చేయి కోసుకుంటానని.. అతడే తన అభిమాన హీరో అని చెప్పుకొచ్చింది. తనకు నటన రాకున్నా నేర్చుకున్నానని.. మహేష్ విట్టాతో కల్ట్ గ్యాంగ్, సోహైల్ తో ‘లక్కీ లక్ష్మణ్’ మూవీలో చిన్న పాత్రలు చేశానని చెప్పుకొచ్చింది. ఇటీవల నాకు చేదు అనుభవం ఎదురైందని.. ఒక మేనేజర్ తన కోరిక తీర్చుకునేందుకు తనను కాస్టింగ్ కౌచ్ లా వాడుకోవాలని చూశాడని గీతూ ఆరోపించింది.

ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట ఉందని.. దానిని హోస్ట్ చేయాలని ఒక మేనేజర్ అడిగారని.. నాకు హోస్టింగ్ అంటే ఇష్టమని సరేనన్నాని గీతూ తెలిపింది. మూడు రోజులు ఆస్ట్రేలియాలో హోస్టింగ్ కు భారీగా రెమ్యూనరేషన్ అడిగానని.. వాళ్లు కూడా సరేనన్నారని వివరించింది.
కరెక్ట్ గా టికెట్ బుక్ చేసే సమయంలో మేనేజర్ పీఏ ఫోన్ చేసి మీకు ‘పర్సనల్ గా ఓకే కదా?’ అని అన్నాడని.. ‘మీకు మా మేనేజర్ కు పర్సనల్ గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం’ అని అన్నాడని గీతూ తెలిపింది. నాకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందని వివరించింది. నా మైండ్ బ్లాంక్ అయ్యి వెంటనే నో చెప్పానని తెలిపింది.
తర్వాత పర్సనల్ గా వద్దు హోస్టింగ్ చేయాలని ఫోన్ చేసినా సరే భయపడి ఆస్ట్రేలియా రానని చెప్పానని గీతూ పేర్కొంది.