https://oktelugu.com/

జీవించి ఉండగానే అంత్య‌క్రియ‌లు చేసుకున్న వృద్ధుడు.. ఎందుకంటే..?

సాధారణంగా ఎవరికైనా చనిపోయిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ఒక వృద్ధుడు మాత్రం అతను బ్రతికి ఉన్న సమయంలోనే అంత్యక్రియలు చేసుకున్నాడు. వృద్ధుడు అంత్యక్రియలు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు, ఆ గ్రామ పూజారి సహకరించడం గమనార్హం. చనిపోక ముందే అంత్యక్రియలు చేసుకున్న ఆ వృద్ధుడి పేరు రూప్‌ రామ్ కాగా ఆ వృద్దుడి వయస్సు 103 సంవత్సరాలు. Also Read: మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా ఉందా.. ఎలా డిలేట్ చేయాలంటే..? వృద్ధుడు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2021 / 04:59 PM IST
    Follow us on

    సాధారణంగా ఎవరికైనా చనిపోయిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ఒక వృద్ధుడు మాత్రం అతను బ్రతికి ఉన్న సమయంలోనే అంత్యక్రియలు చేసుకున్నాడు. వృద్ధుడు అంత్యక్రియలు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు, ఆ గ్రామ పూజారి సహకరించడం గమనార్హం. చనిపోక ముందే అంత్యక్రియలు చేసుకున్న ఆ వృద్ధుడి పేరు రూప్‌ రామ్ కాగా ఆ వృద్దుడి వయస్సు 103 సంవత్సరాలు.

    Also Read: మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా ఉందా.. ఎలా డిలేట్ చేయాలంటే..?

    వృద్ధుడు అంత్యక్రియలు జరుపుకోవడంతో పాటు అంత్యక్రియలకు హాజరైన వారికి రుచికరమైన భోజనాలను కూడా పెట్టాడు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న రూప్ రామ్ వయస్సు 103 ఏళ్లు కావడంతో వృద్ధుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకనని భావించాడు.

    Also Read: ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త..!

    రూప్ రామ్ కు ఇద్దరు పిల్లలు కాగా ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారనే విషయం కూడా అతనికి తెలియదు. మరణం తర్వాత అతని అంత్యక్రియలు ఎవరూ నిర్వహించరని భావించిన వృద్ధుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను తనకు తానుగా నిర్వహించుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం మంత్రోచ్ఛరణలు, బ్యాండ్ మేళం చప్పుళ్లతో అంత్యక్రియలు నిర్వహించుకుని ఆ తరువాత గ్రామస్తులకు రుచికరమైన విందును ఇచ్చాడు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇద్దరు బిడ్డలు పుట్టిన కొన్ని సంవత్సరాలకే తన భార్య చనిపోయిందని.. జీవనం సాగించడానికి బిడ్డలు ఎవరి దారి వాళ్లు వెతుక్కుంటూ వెళ్లారని ఆ వ్యక్తి అన్నారు. తనకు ఎవరూ లేకపోవడం వల్లే బ్రతికి ఉండగానే క‌ర్మకాండ‌లు చేసుకున్నానని చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.