https://oktelugu.com/

మెగాస్టార్ సినిమాలో ముగ్గురు హీరోలు !

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమా పై లేటెస్ట్ గా ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. పది నిమిషాల పాటు ఉండే ఈ రోల్ కోసం అతడు త్వరలోనే హైదరాబాద్ వచ్చి.. షూటింగ్‌ లో కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. అయితే, ఈ రోల్ లో […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 04:54 PM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమా పై లేటెస్ట్ గా ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. పది నిమిషాల పాటు ఉండే ఈ రోల్ కోసం అతడు త్వరలోనే హైదరాబాద్ వచ్చి.. షూటింగ్‌ లో కూడా పాల్గొంటాడని తెలుస్తోంది. అయితే, ఈ రోల్ లో సుదీప్ నే తీసుకోవడానికి కారణం.. కన్నడంలోనూ ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: హౌస్ ఫుల్…100 శాతం ఆక్యుపెన్సీకి తెలంగాణ ప్రభుత్వం ఓకే

    కాగా టాలీవుడ్‌లోనే ఉన్నత విలువలతో రూపొందుతోన్న ‘ఆచార్య’ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఇప్పటికే పలు ఏరియాల హక్కులు అత్యధిక ధరకు అమ్ముడు పోయాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం 200 కోట్లు దాటేసింది. ఒక్క ఆంధ్రలోనే 60 కోట్ల రేషియోలో అమ్మారు. అలాగే నైజాం ఏరియాకు 42 కోట్లు కోట్ చేయడంతో దిల్ రాజు తనకు వద్దని అన్నాడట. దాంతో 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆచార్య నైజాం హక్కులను చేజిక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారట.

    Also Read: సినిమా ట్రైలర్ టాక్: ‘పిట్టకథలు’ !

    వచ్చే వారం నుండి ఆ సెట్ లో చరణ్ – చిరు కాంబినేషన్ లోని సీన్స్ ను షూట్ చేయబోతున్నారట. ఇక ఈ ‘ఆచార్య’ కథ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించినది అని, మెయిన్ గా సినిమాలో అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా మెగాస్టార్ కనిపించబోతున్నాడని టాక్. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్