ఏడేళ్ల క్రితం నాటి కేసు జగన్ మెడకు చుట్టుకుంది.. ఏంటా కేసు?

సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కనుండడం వైసీపీ అభిమానులు, నేతలను తీవ్ర అవమానానికి గురిచేస్తోంది. ఒక సీఎంగా కోర్టుకు హాజరు కావడం జగన్ కు కూడా ఇది ఇబ్బంది కలిగించేదే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలా సీఎంలు కోర్టులకు ఎక్కిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ జగన్ పై మాత్రం అక్రమాస్తుల కేసులతోపాటు పలు కేసులు నమోదు కావడంతో ఆయన కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏడేళ్ల కిందటి కేసును బయటకు […]

Written By: NARESH, Updated On : February 5, 2021 5:04 pm
Follow us on

సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కనుండడం వైసీపీ అభిమానులు, నేతలను తీవ్ర అవమానానికి గురిచేస్తోంది. ఒక సీఎంగా కోర్టుకు హాజరు కావడం జగన్ కు కూడా ఇది ఇబ్బంది కలిగించేదే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలా సీఎంలు కోర్టులకు ఎక్కిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ జగన్ పై మాత్రం అక్రమాస్తుల కేసులతోపాటు పలు కేసులు నమోదు కావడంతో ఆయన కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఏడేళ్ల కిందటి కేసును బయటకు తీసిన కోర్టు విచారణ చేపట్టి జగన్ ను ఏ1గా నిర్ధారించింది. అత్యవసరంగా కోర్టులో హాజరు కావాలని తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ అంశం ఇప్పడు సంచలనంగా మారింది. ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొన్న జగన్ అధికారంలోకి వచ్చాక కొంత ఊరట పొందాడు. మళ్లీ కోర్టు సమన్లు జారీ చేయడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో.. వైసీపీ కేడర్లో అయోమయానికి గురిచేస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి న్యాయస్థానం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఏడేళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించిన సమన్లు ఇవి. అయితే వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన న్యాయస్థానికి వినతి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలా..? లేదా..? అనేది కేసు తీవ్రత ఆధారంగా న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

ఇంతకీ ఏ కేసులో న్యాయం స్థానం జగన్ కు సమన్లు జారీ చేసిందంటే.. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ నుంచి వెళుతున్న 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రచారం నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. అప్పట్లో కోదాడ పోలీసు స్టేషన్లో ఈ కేసును వేశారు. నిరంతరం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని.. ఉల్లంఘన కిందకు వస్తుందని.. అప్పట్లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జిషీటు దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్ ను ఏ1గా చేర్చారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో మిగిలిన ఏ2, ఏ3గా ఉన్నవారిపై కేసులు కొట్టేసింది న్యాయస్థానం. వారు వ్యక్తిగతంగా న్యాయస్థానికి హాజరుకావడం, వివరణ ఇవ్వడంతో కేసును కొట్టివేసింది. తాజాగా ఇదే కేసులో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఫలితంగా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరేలా ఆయన న్యాయస్థానాన్ని కోరుతారని తెలుస్తోంది..