IND vs ENG : ఇంగ్లండ్ కు 333 పరుగులు.. భారత్ కు 9 వికెట్లు.. గెలుపు ఎవరిది?

రెండో టెస్టు రేపు కీలకంగా మారింది. పరుగులు చేస్తే ఇంగ్లండ్ కు విజయం.. వికెట్లు తీస్తే టీమిండియాకు గెలుపు సాధ్యం కానుంది. దీంతో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

Written By: NARESH, Updated On : February 4, 2024 5:38 pm

Ind vs Eng test

Follow us on

IND vs ENG : ఇండియా-ఇంగ్లండ్ మధ్యన రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభం గట్టిగానే మొదలుపెట్టింది. ఇక 9 వికెట్లు తీస్తే విజయం.. దాదాపు 400 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం.. సో ఇప్పుడు ఎవరి సత్తా ఏంటన్నది నాలుగోరోజు తేలనుంది.

ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ – జాక్ క్రాలే మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అశ్విన్ డకెట్ ను ఔట్ చేసి ఇండియాకు రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ ను అందించారు. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడానికి ఇంగ్లండ్‌కి ఇప్పుడు 333 పరుగులు అవసరం కాగా.. విజయం సాధించడానికి భారత్‌కు 9 వికెట్లు అవసరం.

అంతకుముందు రోజు ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టెస్టులో 3వ రోజున విమర్శకుల నోరు మూయించిన శుభ్‌మాన్ గిల్ ఆదివారం భారత్ తరఫున నం.3 బ్యాటర్‌గా తన మొదటి సెంచరీని సాధించాడు. గిల్ బ్యాటింగ్ మాస్టర్‌క్లాస్ తో టీమిండియా తన ఆధిక్యాన్ని 350 పరుగులకు పైగా విస్తరించడానికి మార్గం సుగమం చేసింది. తద్వారా ఇంగ్లాండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేసిన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను 2వ టెస్టు 3వ రోజు తన రెండో ఓవర్‌లో జేమ్స్ ఆండర్సన్ త్వరగానే అవుట్ చేశాడు. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా చివరకు రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 2వ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వి డబుల్ సెంచరీ సాధించాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో నిప్పులు చెరగడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఇక 398 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు దంచికొట్టడంతో 67/1 పరుగులతో కొనసాగుతోంది. భారత్‌ను ఓడించడానికి 332 పరుగులు చేయాలి. సిరీస్ సమం చేయడానికి ఆతిథ్య జట్టుకు 9 వికెట్లు అవసరం.

విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్ట్ గెలిచిన ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు రేపు కీలకంగా మారింది. పరుగులు చేస్తే ఇంగ్లండ్ కు విజయం.. వికెట్లు తీస్తే టీమిండియాకు గెలుపు సాధ్యం కానుంది. దీంతో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.