తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఏ విధంగా డబ్బు సులభంగా, రిస్క్ లేకుండా సంపాదించవచ్చనే విషయం గురించి అవగాహన ఉండదు. అయితే ప్రతి నెలా తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ సులభంగా కోటీశ్వరులు కావచ్చు. ఎక్కువ కాలం పెట్టుబడులు పెట్టి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. Also Read: వాట్సాప్ పేమెంట్స్ చేస్తున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..? […]

Written By: Kusuma Aggunna, Updated On : December 3, 2020 12:22 pm
Follow us on


మనలో ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఏ విధంగా డబ్బు సులభంగా, రిస్క్ లేకుండా సంపాదించవచ్చనే విషయం గురించి అవగాహన ఉండదు. అయితే ప్రతి నెలా తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ సులభంగా కోటీశ్వరులు కావచ్చు. ఎక్కువ కాలం పెట్టుబడులు పెట్టి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు.

Also Read: వాట్సాప్ పేమెంట్స్ చేస్తున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కు 7.1 శాతం వడ్డీ వస్తుండగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి. ప్రతి నెలా 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినా సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. పబ్లిల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి మెచ్యూరిటీ కాలం పూర్తైన తరువాత ఆసక్తి ఉంటే మెచ్యూ రిటీ కాలాన్ని పొడించుకునే అవకాశం ఉంటుంది.

Also Read: మార్కెట్ లోకి కొత్తరకం పెట్రోల్.. తక్కువ ధరతో ఎక్కువ లాభాలు..?

నెలకు 7,000 రూపాయల చొప్పున పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే 35 సంవత్సరాల తరువాత కోటి రూపాయలకు పైగా పొందే అవకాశం ఉంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రిస్క్ లేకుండా లాభం పొందే అవకాశం ఉండటంతో పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: జనరల్

దీర్ఘకాలం పాటు డబ్బులను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎంత తక్కువ వయస్సులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత త్వరగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది.