https://oktelugu.com/

వరదసాయం టీఆర్ఎస్ ను గట్టెక్కించేనా?

ప్రతీ ఎన్నికలో జెట్ స్పీడుతో దూసుకెళుతున్న టీఆర్ఎస్ కు కొద్దిరోజులుగా ఊహించని షాకులు తగులుతున్నాయి. గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ దే హవా నడిచింది. గత అసెంబ్లీ.. మున్సిపల్.. పంచాయతీ.. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వార్ వన్ సైడ్ అన్నట్లుగా గులాబీ జెండాను రెపరెపలాడించింది. Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. దుబ్బాక ఫలితం రిపీట్ కానుందా? అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2020 / 08:54 AM IST
    Follow us on

    ప్రతీ ఎన్నికలో జెట్ స్పీడుతో దూసుకెళుతున్న టీఆర్ఎస్ కు కొద్దిరోజులుగా ఊహించని షాకులు తగులుతున్నాయి. గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ దే హవా నడిచింది. గత అసెంబ్లీ.. మున్సిపల్.. పంచాయతీ.. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వార్ వన్ సైడ్ అన్నట్లుగా గులాబీ జెండాను రెపరెపలాడించింది.

    Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. దుబ్బాక ఫలితం రిపీట్ కానుందా?

    అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. గత కొన్నాళ్లుగా తెలంగాణలో జరిగే ప్రతీ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చి స్వల్ప మెజార్టీతో గెలుపొందింది.

    ఊహించని విధంగా టీఆర్ఎస్ ఓటమిపాలవడంతో సీఎం కేసీఆర్ దుబ్బాక ఫలితంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో కేసీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ సర్వ సైన్యాన్ని రంగంలోకి దింపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లోనే తిష్టవేసి ప్రచారం చేశారు.

    టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ సైతం జాతీయ నేతలను.. కేంద్రమంత్రులను రంగంలోకి దింపి ప్రచారం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగాయి. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ ముందు నుంచే ప్రచారం చేస్తూ వస్తోంది. హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో హోరెత్తించింది.

    Also Read: 24 గంటలకు.. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ!

    కాగా హైదరాబాద్లో వచ్చిన వరదలు టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరాయి. అయితే వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఇంటికి రూ.10వేల సాయాన్ని ప్రకటించింది. ఎన్నికల ముందు కొన్ని ఏరియాలకు వరదసాయం అందగా.. కొన్నిచోట్ల అందలేదు. వరదసాయం పంపిణీని టీఆర్ఎస్ నేతలే పంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.

    ఈనేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1న జరిగింది. మందకొడిగా సాగిన ఓటింగ్ తో పోలింగ్ శాతం తగ్గుతుందని భావించినా చివరాఖరకు గతంలో కంటే ఎక్కువగానే పోలింది. దీంతో టీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. అయితే వరద సాయం అందించిన కొన్ని డివిజన్లలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదుకాగా.. మరికొన్ని చోట్ల తక్కువగా నమోదైనట్లు సమాచారం.

    దీంతో వరద సాయం అందుకున్నవారు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేశారా? లేదా వ్యతిరేకంగా వేశారా? అనేది మాత్రం తెలియడం లేదు. రేపు ఎన్నికల ఫలితాలు రానుండటంతో వరద సాయం టీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందా? లేదా వరదలో ముంచుతుందా? అనేది తేలనుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్