https://oktelugu.com/

Covid 19: ఇంట్రెస్టింగ్.. కరోనా ఇకపై ‘కాటు’ వేయదా?

Covid 19: కలియుగం అంతం అవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అయితే 2000, 2020, 2040, 2064 సంవత్సరాల్లో ప్రపంచ అంతం అవుతుందనే అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ సమయం వచ్చే నాటికి ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లుగానే నిలిచిపోయాయి. కాగా కొన్ని కొత్తకొత్త వైరస్ లు పుట్టికొచ్చి మానవళికి సవాళ్లు విసురుతుండటం మాత్రం చర్చనీయాంశంగా మారింది. గత వందేళ్లలో అనేక కొత్త జబ్బులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూశాయి. స్వైన్ ప్లూ మహమ్మరి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2022 / 01:52 PM IST
    Follow us on

    Covid 19: కలియుగం అంతం అవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అయితే 2000, 2020, 2040, 2064 సంవత్సరాల్లో ప్రపంచ అంతం అవుతుందనే అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ సమయం వచ్చే నాటికి ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లుగానే నిలిచిపోయాయి. కాగా కొన్ని కొత్తకొత్త వైరస్ లు పుట్టికొచ్చి మానవళికి సవాళ్లు విసురుతుండటం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

    Covid 19:

    గత వందేళ్లలో అనేక కొత్త జబ్బులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూశాయి. స్వైన్ ప్లూ మహమ్మరి కొన్ని కోట్లమంది ప్రాణాలను బలిగింది. అలాగే బర్డ్ ఫ్యూ అనేది పశుపక్షాదులను కబళించి వేసింది. ఈ జబ్బులకు సైంటిస్టులు వ్యాక్సిన్లు, మందులు కనిపెట్టడంతో కాలక్రమంలో ఈ రోగాలన్నీ కూడా మానవ జీవనంలో భాగమై పోయాయి.

    Also Read:  విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

    2000 సంవత్సరంలో Y2K సమస్య వచ్చింది. దీనికి మేధావులు పరిష్కారం కనిపెట్టడంతో పెనుముప్పు తప్పింది. ఇక 2020లో వెలుగుచూసిన కరోనా మహమ్మరి ప్రపంచానికి కొత్త సవాలుగా మారింది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రకృతి సిద్ధంగా పుట్టిందా? లేదంటే కృత్రిమంగా తయారు చేశారా? అన్నది పక్కన పెడితే ఈ వైరస్ మాత్రం మానవళికి డేంజర్ సిగ్నల్స్ ను పంపించింది.

    సంఘ జీవిగా బతుకుతున్న మనిషిని కరోనా మహమ్మరి ఒంటిరిని చేసి పడేసింది. ఒక మనిషి తోటి మనిషి చూస్తేనే భయపడే రోజులను కరోనా మహమ్మరి కళ్లారా చూపించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖానికి మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటివి గత రెండేళ్లలో కామన్ అయిపోయాయి. విందు, వినోదాలు, సభలు, సమావేశాలు అన్ని బంద్ అయ్యి మనుషులు కూడా ఆన్ లైన్ బొమ్మల్లా మారిపోవాల్సి పరిస్థితులు దాపురించాయి.

    మరోవైపు కరోనాతో అగ్రరాజ్యాలు కుదేలుకాగా మధ్య, పేద దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సైంటిస్టుల కృషి ఫలితంగా కరోనాకు వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే కరోనా మహ్మమరి కొత్త కొత్త వేరింయట్ల రూపంలో మనుషులపై దాడి చేస్తుండటం ఆందోళనలను రేపుతోంది.

    కోవిడ్ 19తోపాటు డెల్టా, ఒమ్రికాన్ వేరియెంట్లు ప్రస్తుతం మానవళిని భయపెడుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి బాగా పెరిగిపోయింది. దీంతో ఈ వేరింయట్ల బారిన ప్రజలు పడినప్పటికీ త్వరగా రికవరీ అవుతున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. క్రమంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని కోల్పోతుండటం కూాడా మనవాళికి కలిసి రానుంది.

    ఈక్రమంలోనే ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మరి సాధారణ జబ్బుల లిస్టులో చేరుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రజలు కరోనా కాటుకు గురైన పెద్దగా ప్రమాదమేమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ సమయం వరకు ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది. దీంతో కరోనాతో మనిషి సహజీవనం తప్పనిసరి కానుంది.

    Also Read:  ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?