Nagarjuna: బంగార్రాజు మూవీ సక్సెస్ మీట్ తూ.గో జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. కాగా ఈ సక్సెస్ మీట్ లో హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇటీవల సీఎం జగన్‌తో భేటీ గురించి చిరంజీవితో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుందని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే. త్వరలోనే టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం వస్తుంది’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. గత వారం ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో మెగాస్టార్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
అయితే, సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ పై హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘మా అందరి కోసమే చిరంజీవి గారు జగన్ గారితో సమావేశం అయ్యారు. ఆయన నాతో జగన్ దగ్గరకి వెళ్తున్నా అని చెప్పారు. అయితే, నా సినిమా విడుదల ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. నిజానికి జగన్ తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారు. చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదు. అందరి కోసం వెళ్లారు. సీఎం జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Also Read: హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి ?
జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం. అందుకే , చిరంజీవి వెళ్తా అనగానే నేను వెళ్లమని సలహా ఇచ్చాను. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను అంటూ నాగార్జున అప్పుడు తెలిపాడు. మళ్ళీ తాజాగా నాగార్జున జగన్ – చిరు భేటీ పై కామెంట్స్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి వైఎస్ జగన్ సినిమా టికెట్లు రేట్లు విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తాడో ? చూడాలి. టికెట్ల రేట్ల విషయంలో సినిమా జనానికి మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడని ఇప్పటికి అయితే వార్తలు వస్తున్నాయి.
Also Read: అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే.. ప్రతీకారం తీర్చుకుంటాడా..?