https://oktelugu.com/

Congress vs BJP : బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ దిగజారుడు ప్రచారం

బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ చేస్తోన్న దిగజారుడు ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : February 20, 2024 / 12:51 PM IST

Congress vs BJP : తెలంగాణలో మళ్లీ మొదలైంది.. కాంగ్రెస్ ఒక నేరేటివ్ ను ప్రజల్లో సెట్ చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నమ్మించింది. రహస్యంగా పొత్తులు ఉన్నాయని బాగా బలంగా జనంలోకి తీసుకెళ్లింది. కాంగ్రెస్ వ్యూహకర్తలు సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డిలు కలిసే ఈ నాటకం ఆడారు. దానికి చిలువలు పలువలు అల్లేసి గతంలో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ప్రచారం చేసి జనాన్ని నమ్మించింది.

బీజేపీ బిల్లులను వ్యతిరేకించి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ విలన్లుగా చూపించడంలో సక్సెస్ అయ్యాయి..

అందుకే ఈ విషయంలో బీజేపీ ప్రచార విభాగం అట్టర్ ఫ్లాప్. ఈరోజుకు కూడా సరైన కౌంటర్ చేయలేకపోతున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు గట్టిగా కౌంటర్ ఇచ్చినా అది సహేతుకంగా ప్రజల్లోకి వెళ్లలేదు. డిబేట్లలో కూర్చున్న వారు బీజేపీ తరుఫున గట్టిగా వాదించి తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. బీజేపీ ఈ విషయంలో ఘోరంగా విఫలమైందనే చెప్పాలి.

బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ చేస్తోన్న దిగజారుడు ప్రచారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ దిగజారుడు ప్రచారం || Congress is Afraid of BJP in Telangana || Ram Talk