https://oktelugu.com/

Vishwak Sen: అర్జున్ తో వివాదం… చాలా నష్టపోయానంటున్న విశ్వక్ సేన్, కీలక విషయాలు వెలుగులోకి!

టాలీవుడ్ టాప్ స్టార్స్ తో నేను పని చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ లో విశ్వక్ సేన్ లాంటి క్రమశిక్షణ లేని నటుడిని చూడలేదని వాపోయాడు. షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశాక వాయిదా వేయమన్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 20, 2024 / 12:48 PM IST
    Follow us on

    Vishwak Sen: అర్జున్-విశ్వక్ సేన్ మధ్య ఓ ప్రాజెక్టు విషయంలో వివాదం నడిచింది. అర్జున్ దర్శకుడిగా విశ్వక్ సేన్ హీరోగా మూవీ ప్రకటించారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. పవన్ కళ్యాణ్ అతిథిగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. అర్జున్-విశ్వక్ సేన్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అర్జున్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ ని ఏకిపారేశారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో నేను పని చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ లో విశ్వక్ సేన్ లాంటి క్రమశిక్షణ లేని నటుడిని చూడలేదని వాపోయాడు.

    షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశాక వాయిదా వేయమన్నాడు. నా ఫోన్స్ కి సరిగా రెస్పాండ్ కాలేదు. అతను చెప్పినట్లు ఒకటి రెండు సార్లు వాయిదా వేశాను. షూటింగ్ కి రాకుండా ఇబ్బండిపెట్టాడు. అందుకే అతని మీద కంప్లైంట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీనికి వివరణగా… విశ్వక్ కొన్ని కామెంట్స్ చేశాడు. అర్జున్ ఎవరి మాట వినరు. తన మాటే చెల్లాలి అంటారు. స్క్రిప్ట్ లో నేను కొన్ని మార్పులు సూచించాను. ఆయన ఒప్పుకోలేదు… అని విశ్వక్ సేన్ తన వెర్షన్ వినిపించాడు.

    తాజాగా అర్జున్ తో వివాదం పై విశ్వక్ సేన్ స్పందించాడు. అర్జున్ మీదున్న గౌరవంతో నేను కొన్ని విషయాలు బయట పెట్టలేదు. నేను ఒకరోజు మాత్రమే వాయిదా వేయమన్నాను. ఆయన మా ఇంటికి వచ్చి పేరెంట్స్ తో ప్రాధేయపడ్డాడు. నేను తీసుకున్న రెమ్యునరేషన్ కి రెట్టింపు చెల్లించాను. అర్జున్ చేసిన ఆరోపణల వలన ఎక్కువగా నష్టపోయింది నేనే… అని విశ్వక్ సేన్ కీలక విషయాలు వెల్లడించాడు.

    విశ్వక్ సేన్ ఆరోపణల నేపథ్యంలో అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి విడుదలకు సిద్ధం అవుతుంది. ఇటీవల టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 29న ట్రైలర్ విడుదల కానుంది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. అలాగే విశ్వక్ సేన్ తన 10వ చిత్రం కూడా ప్రకటించారు.