Pawan Kalyan Vs Jagan: పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి తిడితే తప్ప మన సీఎం జగన్ సార్ బయటకు రాలేకపోయారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై నేరుగా విమర్శలు చేయకుండా మంత్రులను ఉసిగొల్పి వారితో పవన్ పై బండ బూతులు తిట్టించే ఇన్ డైరెక్ట్ స్ట్రాటజీని జగన్ అమలు చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ వీరావేశం చూశాక.. ప్రజల్లో ఆయనకు వచ్చిన సెంటిమెంట్ కు బెంబేలెత్తిపోయిన జగన్ ఎట్టకేలకు ‘పవన్ పేరు ఎత్తకుండా’ ఆయనపై ఆరోపణలు గుప్పించారు.

అవనిగడ్డలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్ ఎట్టకేలకు బరెస్ట్ అయ్యాడు. పవన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ‘వీధి రౌడీలు కూడా అలా మాట్లాడుతారో లేదో నాకు తెలియదు.. టీవీల్లో చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు నాయకులా? అని బాధనిపిస్తోంది. దత్తపుత్రుడితో దత్తతండ్రి ఏమేం మాట్లాడిస్తున్నారో అంతా చూస్తున్నాం.. మూడు రాజధానులతో మేలు అంటుంటే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నాడు.. మీరూ చేసుకోండని సలహాలు ఇస్తున్నాడు.. ఇలా అయితే మహిళల పరిస్థితేంటి? ’ప్రజలు ఆలోచించాలి’ అంటూ జగన్ మొసలి కన్నీరు కార్చాడు.
బండ బూతులు తిడుతుంటే బాధ అనిపిస్తోందన్న జగన్ మరి వారి మంత్రులు పవన్ ను ఇదే బండ బూతులు తిడుతుంటే ఎందుకు బాధ అనిపించడం లేదు..? తనదాకా వస్తే కానీ ఆ బాధ తెలియడం లేదా? విచ్చలవిడిగా తన మంత్రులు పవన్ పై నోరుపారేసుకుంటే ఆ బాధ ఎందుకు లేదని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ మంత్రులు తిడితే అది సంసారం.. జనసేనాని పవన్ కౌంటర్ ఇస్తే అది వ్యభిచారమా? అన్నది జగన్ ఆలోచించుకోవాలి. ఓవైపు మంత్రులను ఉసిగొల్పుతూ.. మరోవైపు ఈ ముసలికన్నీరు కార్చడం ఏంటని కౌంటర్లు పడుతున్నాయి. ఈ బూతుల రాజకీయాన్ని జగన్ కంట్రోల్ చేస్తేనే అటు వైపు నుంచి ఆగుతాయి. చంద్రబాబులా ఏది తిట్టినా పడడానికి పవన్ సామాన్యుడు కాదు.. మొండి ఘటం.. ఇప్పటికైనా పవన్ వేడి తగిలి ముఖ్యమంత్రి జగన్ కౌంటర్లు ఇచ్చే పరిస్థితికి చేరాడు. ఈ బూతుల రాజకీయాన్ని ఆపకపోతే ఇంకా పరిస్థితులు చాలా దూరం వెళ్లే అవకాశాలు ఉంటాయి.