IYR Krishna Rao : ఏపీలో ఇప్పుడు అందరి చూపు జనసేనాని పవన్ వైపే నెలకొంది. పొత్తుల రాజకీయం తెరపైకి రావడంతో విశ్లేషకులు అంతా పవన్ కింగ్ మేకర్ అవుతాడని అంచనావేస్తున్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటి తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పవన్ బీజేపీకి దూరం అవుతారనే చర్చ కూడా నడుస్తోంది.

ఇక పవన్ -చంద్రబాబు కలయికపై తాజాగా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశాడు. ఏపీలో బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసి చిత్తశుద్ధితో సమన్వయంతో కృషి చేస్తే ఏపీ ఎన్నికల్లో తప్పకుండా హంగ్ వస్తుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ కు హంగ్ అసెంబ్లీ సువర్ణ అవకాశాలు కలుగ చేయవచ్చని వ్యాఖ్యానించారు. రెండూ పార్టీలు కలిసి ముందుకు సాగాలనే అభిప్రాయాన్ని కృష్ణారావు చెప్పుకొచ్చారు. హంగ్ వస్తే పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా అంటూ ధీమాను వ్యక్తం చేశారు.
ఇక ఐవైఆర్ లాంటి సీనియర్ రిటైర్డ్ అధికారులు కూడా రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ఇదివరకూ బీజేపీ వైపు చూసిన ఆయన ఇప్పుడు జనసేనానికి మద్దతుగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా పార్టీ ప్రాధాన్యతనిస్తూ పోటీకి ఐవైఆర్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఏపీలో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత రిటైర్అయ్యాక రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.