https://oktelugu.com/

Pakistan : పాకిస్తాన్ ఖైబర్ – ఫక్తూన్వాలో అంతర్యుద్ధం మొదలయ్యిందా?

గత రెండు మూడు రోజులుగా ఇక్కడ యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ సైనికులను చంపుతున్నారు. ఉద్యమకారులను పాక్ సైనికులు చంపేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2023 / 12:33 PM IST

    Pakistan : పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతర్యుద్ధ దిశగా పాకిస్తాన్ వెళుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెలూచీస్తాన్, ఫంక్తూన్లు, సింధూల తిరుగుబాటుతోపాటు రాడికల్ ఇస్లాం ఆగడాలతో పాక్ అట్టుకుతోంది. దీనికి తోడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. 300 రూపాయలకు లీటర్ పెట్రోల్ దొరుకుతోంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతోంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ దివాళా తీయడానికి దగ్గరైంది. ఇది గుంభనంగా ఉంది. ఎప్పుడైనా బయటపడే అవకాశాలు ఉన్నాయి.

    పాకిస్తాన్ లోని ముక్యంగా ఖైబర్ ఫక్తున్వా.. బెలూచీస్తాన్ లు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాలు.. ఇవి బ్రిటీష్ పాలన కింద ఉండేవి. ఫస్తూన్ల రాకతో బెలూచీ మనుగడ కష్టమైంది. గత నెలలో ఇక్కడ 12 మంది సైనికులు మరణించారు. గత రెండు మూడు రోజులుగా ఇక్కడ యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ సైనికులను చంపుతున్నారు. ఉద్యమకారులను పాక్ సైనికులు చంపేస్తున్నారు.

    గిల్ట్ బలిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్యమాలు జరుగుతున్నాయి. హింసాకాండ కూడా తీవ్రస్థాయిలో నమోదవుతోంది. అయినప్పటికీ వీటిని నిరోధానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ స్థానిక అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

    ఇటీవల జరిగిన ఘటనలో దాదాపు 75 మంది దాకా పాకిస్తాన్ సైనికులను పట్టుకున్నారని.. రెండు మిలటరీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఆయుధాలన్నీ తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నాయి. అప్ఘనిస్తాన్ తాలిబన్లతో కలిసి పాకిస్తాన్ పై వీరంతా యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

    పాకిస్తాన్ ఖైబర్ – ఫక్తూన్వాలో అంతర్యుద్ధం మొదలయ్యిందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.