https://oktelugu.com/

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 13, 2021 / 11:52 AM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ కార్డ్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలులో భాగంగా కేంద్రం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

    Also Read: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..?

    మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ సహాయంతో జీవనోపాధి కొరకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లు సులభంగా రేషన్ పొందవచ్చు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ స్కీమ్ లో చాలా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం భాగమయ్యాయని సుధాన్షు పాండే తెలిపారు. అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ఈ స్కీమ్ లో అనుసంధానం కావాల్సి ఉంది.

    Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ.200 ఆదాతో చేతికి రూ.17 లక్షలు..?

    2020 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల మధ్య ఏకంగా 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ అమలులో భాగంగా జరగడం గమనార్హం. దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థ పరిధిలో ఉన్నారు. ఈ స్కీమ్ కింద నెలకు సగటున కోటిన్నర నుంచి కోటీ 60 లక్షల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదవుతూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ప్రస్తుతం మేరా రేషన్ మొబైల్ యాప్ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఈ యాప్ ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.