గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..?

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కస్టమర్లకు గూగుల్ పే మరో శుభవార్త చెప్పింది. అతి త్వరలో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ పే సిద్ధమైంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సులువుగా ట్రాన్సాక్షన్ వివరాలను మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది. Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ.200 ఆదాతో […]

Written By: Kusuma Aggunna, Updated On : March 13, 2021 12:00 pm
Follow us on

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కస్టమర్లకు గూగుల్ పే మరో శుభవార్త చెప్పింది. అతి త్వరలో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ పే సిద్ధమైంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సులువుగా ట్రాన్సాక్షన్ వివరాలను మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది.

Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ.200 ఆదాతో చేతికి రూ.17 లక్షలు..?

గూగుల్ పే తెచ్చిన కొత్త ఫీచర్ లో పర్సనలైజేషన్ ఆప్షన్‌ను ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ పే సెట్టింగ్స్ ద్వారా యాప్ ను ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ ను సులభంగా డిలేట్ చేయవచ్చు. త్వరలో గూగుల్ పే యాప్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ఫీచర్ ను సులభంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుంది.

Also Read: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవాలా.. ట్రిక్స్ ఇవే..?

పర్సనలైజేషన్ కంట్రోల్‌ ఆప్షన్‌ను ఆఫ్, చేసుకుంటే గూగుల్ పే ఇప్పుడు ఎలా పని చేస్తుందో అదే విధంగా పని చేస్తుంది. గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్న యూజర్లు యాప్ ను అప్ డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. దేశంలో కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్న ఈ యాప్ వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

గూగుల్ పేతో పాటు ఫోన్ పే, భీమ్ లాంటి యాప్ లను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నోట్లరద్దు తరువాత డిజిటల్ పేమెంట్ యాప్ ల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.