కేంద్రప్రభుత్వం తాజాగా సహకార రంగ పటిష్టతకు, విస్తరణకు సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) లను వ్యవసాయానికే కాకుండా పాడి, మత్స్య పరిశ్రమలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇదో ఓ అద్భుతమైన నిర్ణయంగా చెప్పొచ్చు.
సహకార సంఘాలు మన స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఉన్నాయి. బ్రిటీష్ వారే దీన్ని మొదలుపెట్టారు. సహకార సంఘాలను 1904లోనే బ్రిటీష్ వారు భారత్ లో ప్రవేశపెట్టారు. దీని తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఇందులో వచ్చిన ఓ మైలు రాయి ఏదైనా అందంటే ‘అమూల్’. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం 1946లోనే డిసెంబర్ 14న కేడాయ్ జిల్లాలో అమూల్ సంస్థ స్తాపించబడింది. వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో మోరార్జీ దేశాయ్, త్రిభువన్ దాస్ పటేల్ లు దీన్ని స్థాపించారు. ఇదో సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు.
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘ములుకునూర్ సహకార సంఘం’ చాలా సక్సెస్ అయ్యింది. పాల ఉత్పత్తి నుంచి మొదలుపెట్టి అన్ని రంగాలకు విస్తరించింది. కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది.
అసలు ఈ సహకార సంఘాలు అంటే ఏమిటీ? వీటిని ఎవరు పెట్టారు? మోడీ ప్రభుత్వం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..