
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏది చేసినా సంచలనమే. సినిమాలైనా రాజకీయాలైనా ఆయన స్టైలే వేరు. రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రచారం రథం వారాహి సిద్ధం చేసుకున్నారు. దానికి పూజలు కూడా చేయించారు. మొదట తెలంగాణలోని కొండగట్టులో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ చేయించిన ఆయన తరువాత ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని విజయవాడ వెళ్లారు. అక్కడ కూడా కనకదుర్గమ్మ సన్నిధిలో మరోమారు పూజలు చేయించి అమ్మవారికి ఓ చీర సమర్పించారు. సాధారణంగా భక్తులు ఇచ్చే చీరలను అదే ధరకు అమ్ముతుంటారట.
చీరతో వచ్చింది చిక్కే..
పవన్ కల్యాణ్ సమర్పించిన చీరకు రూ.8 వేలు అని ప్రచారం జరగడంతో అందరు భక్తులు తమకు ఆ చీర కావాలని పోటీ పడ్డారు. ఆలయ అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ భక్తుడు మాత్రం చీరకు వేలం పెట్టి ఎవరు ఎక్కువ ధర పాడితే వారికి ఇవ్వాలని సూచించాడట. కానీ ఆలయ అధికారులు అలా చేయలేదు. ఒకవేళ అలా చేస్తే విమర్శలు ఎదుర్కొనే వారు. దేవాలయంలో కూడా వ్యాపారం చేస్తున్నారనే వదంతులు వచ్చేవి. ఈ నేపథ్యంలో చీరను ఏం చేయాలనేదానిపై తలలు పట్టుకుంటున్నారు.
హీరోలు ఇచ్చిన చీరలతో..
హీరోలు ఇచ్చిన చీరలతో ఇంత చిక్కు వస్తుందని అనుకోలేదట. కానీ ప్రస్తుతం ఆ చీరను మళ్లీ పవన్ కల్యాణ్ కే పంపాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఏం చేస్తే ఎక్కడి నుంచి మరెక్కడకు వెళ్తుందో అర్థం కాక భయపడుతున్నారు. పవన్ కల్యాణ్ సమర్పించిన చీరతో ఇప్పుడు వివాదం మొదలైంది. ఆ చీరను ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోతున్నారు. చివరకు మళ్లీ ఆయనకే ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఓ చీర అధికారుల్లో ఆందోళనకు కారణమైంది.

ఆలోచనలకు తెర
దేవతకు సమర్పించిన చీర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. చీర చిక్కులో పడిన అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చీర కూడా ప్రధానంగా మారడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చీర విషయంలో అధికారులు పెద్ద వివాదాల్లో పడతామనే ఉద్దేశంతో తమకెందుకు ఈ తతంగాలు అని అనుకున్నారో ఏమోకానీ ఆయనకే పంపించాలని అనుకున్నారట. దీంతో చీర గురించి ఇంత సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.