
BRS MLA Harassment : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఇవ్వాళ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేస్తోంది.. కానీ ఆ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పార్టీ మహిళా ప్రజాప్రతినిధులను కోరిక తీర్చమంటూ వలపు వల విసురుతున్నారు. అంతేకాదు బంగారం, డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. వారిని లైన్లో పెట్టేందుకు ఇతర మహిళ ప్రజా ప్రతినిధులతో రాయబారం పంపుతున్నారు.. ఇలా ఓ మహిళా సర్పంచ్ కు రాయబారం పంపి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కొంటె ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన కురసపల్లి నవ్య గత ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచింది. చూసేందుకు అందంగా ఉండడంతో ఆమె నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నవ్య మీద మనసు పడ్డాడు. అసలే కొంటె ఎమ్మెల్యేగా పేరు పొందడంతో ఆమెను ముగ్గులోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు.. వర్కౌట్ కాకపోవడంతో తనకు అత్యంత సన్నిహితురాలు అయిన ఓ మహిళ ప్రజా ప్రతినిధిని రంగంలోకి దింపాడు. ఆమె ద్వారా రాయ” బేరం” పంపాడు. ” నవ్య నువ్వు చూసేందుకు అందంగా ఉంటావు.. ఆడవాళ్లే నిన్ను చూసి అసూయపడతారు. అలాంటిది ఆ ఎమ్మెల్యే నిన్ను చూశాడు. మనసుపడ్డాడు. షాపింగ్ అని చెప్పి బయటకు రా. సార్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. బంగారం, డబ్బులు ఇస్తాడు.ల్ ఒక్కసారిగా నీ ముఖచిత్రమే మారిపోతుంది. గతంలో నేను ఆ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లిన దానినే. నన్ను ఆయన బాగా చూసుకుంటాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే. ఆడవాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన చాలా లోతుగా అర్థం చేసుకుంటాడు” అని సదరు మహిళా ప్రజాప్రతినిధి నవ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయినప్పటికీ నవ్య లొంగలేదు.
ఇక ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ అవుతున్నది. నిజానికి నవ్యకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. గత ఎన్నికల్లో భర్త ప్రవీణ్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్ గా ఎన్నికయ్యారు. కానీ అదే ఆమెకు శాపంగా మారింది. మొదటినుంచి ఆమె మీద మనసు పడ్డ ఎమ్మెల్యే.. ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. బిల్లులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా చేశాడు. కనీసం ఆమెను పార్టీ కార్యక్రమాలకు కూడా చేసాడు. మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. చివరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ఆమెకు ఆహ్వానం లేదు. ఎమ్మెల్యే తీరుపై కేసీఆర్, కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు సదరు సర్పంచ్ సమయత్తమవుతోంది.