BJP vs TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పరిస్థితి తారుమారైంది. తాము అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి అని మథనపడుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కౌంటర్లతో విచురుకుపడిన టీఆర్ఎస్ కు ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఎందుకంటే ఈ సమావేశాల సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ పేరు ఎత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి వరకు కేసీఆర్ పై మోదీ ఎలాంటి విమర్శలు చేస్తారోనని అనుకున్నవాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అటు టీఆర్ఎస్ నాయకులు ఎంత రెచ్చగొట్టినా మోదీ ఏ విధంగా స్పందించకపోవడంపై బీజేపీకి ప్లస్ గా మారిందని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ పేరు ఎత్తకపోవడంపై రకరకాలుగా అనుకుంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ లో కమలంపై విమర్శల దాడి ప్రారంభమైంది. కేటీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు మోదీ తెలంగాణకు ఏం తెచ్చాడని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఏకంగా ఎన్డీయేకు వ్యతిరేకమైన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మోదీ విఫలమయ్యాడని విమర్శించారు. అయితే ఆ తరువాత మోదీ కూడా తనపై విమర్శల దాడి చేస్తారని భావించారు.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ లో చేరే వారికి టికెట్ల హామీ ఇవ్వడం లేదట.. రేవంత్ సంచలనం
కానీ బీజేపీ సభలో మోదీ కేసీఆర్ పేరు ఎత్తలేదు. కేవలం తెలంగాణ ప్రాంత అంశాల గురించి మాత్రమే మాట్లాడారు. త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని, తాము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఎక్కడా చిన్న విమర్శ లేకుండా మోదీ ప్రసంగం ముగిసింది. అయితే బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తాము చాలు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో సభ జరుగుతున్న వేళ కొందరు టీఆర్ఎస్ నాయకులు నల్ల బెలూన్లను ఎగరవేశారు.ఇలా ప్రచార హోర్డింగ్ ల నుంచి బీజేపీని రెచ్చగొట్టినా అవేమీ పట్టించుకోకుండా సభను నిర్వహించారు. అనుకున్నట్లుగానే మోదీ సభ సక్సెస్ అయింది.

అయితే ఈ సభ తరువాత టీఆర్ఎస్ లో అయోమయ పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కేడర్లోనూ ఇప్పట్లో జాతీయ రాజకీయాల జోలికి వెళ్లకపోవడమే మంచిదన్నట్లు చర్చ సాగుతోంది. రాష్ట్రంలో చాలా విషయాల్లో వ్యతిరేకత ఏర్పడిందని, వాటిని సరిచేస్తే చాలు అన్నట్లుగా ఉన్నారు.
కానీ బీజేపీ మాత్రం తరువాత కార్యక్రమాలను సీరియస్ గా చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను ఈటల రాజేందర్ కు అప్పగించారు.అటు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను నియమించి మోదీ ప్రభుత్వం గురించి ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వాలని చూస్తున్నారు.
Also Read:Ananya Panday: విచ్చలవిడిగా తిరిగేసింది.. పెళ్లి మాత్రం తన పేరెంట్స్ ఇష్టమట
[…] […]