Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాపత్రయపడుతోంది. రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందుకోసమే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరిని టచ్ లోకి తీసుకుని మంతనాలు సాగిస్తోంది. అధికార పార్టీపై కోపంతో ఉన్న వారి జాబితా రెడీ చేసుకుని తమ పార్టీలోకి రావాలని తాయిలాలు ప్రకటిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కొందరు నేతలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో చేరే వారి పట్ల అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతోంది. అందుకే వారి పేర్లు గోప్యంగా ఉంచుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ను విజయపథంలో నిలబెట్టేందుకు నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
Also Read: PM Modi- Jagan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ నోట ప్రత్యేక హోదా మాట
ఇప్పటికే పార్టీలో విభేదాలు పొడచూపుతున్న క్రమంలో ఇటీవల జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య విభేదాలతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడిందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక పార్టీలో నేతల్లో సమన్వయం కొరవడింది. ఫలితంగా పార్టీ కార్యక్రమాలు సక్సెస్ కావడం లేదు. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతుంటే కాంగ్రెస్ మాత్రం చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలనే యోచనలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం.
అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలికితేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుంది. లేకపోతే పూర్వపు స్థితి దక్కనుంది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ గుణపాఠం నేర్వలేదు. నేతల్లో సఖ్యత కానరావడం లేదు. దీంతోనే పార్టీ మనుగడ అనుమానాస్పదంగానే మారుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి రావడం మాత్రం కలగానే మిగలనుంది. అందుకే కాంగ్రెస్ నాయకులు పునరాలోచించుకుని పార్టీ కోసం సమన్వయం సాధించి ఐక్యతతో ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని గుర్తుంచుకోవాలి.

కాంగ్రెస్ లో చేరే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామనే హామీ ఇస్తున్నారనే వాదనపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎవరికి కూడా ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేశారు. ఇప్పటివరకు చేరిన వారికి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీ పై అభిమానంతోనే వారు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రకటన సంచలనం కలిగిస్తోంది.
Also Read:R. Narayana Murthy: ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో తీవ్ర విషాదం.. అసలేమైందంటే?
[…] Also Read: Revanth Reddy: కాంగ్రెస్ లో చేరే వారికి టికెట్… […]