Samantha: ‘సమంత’ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మధ్యలో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ యాడ్స్ రూపంలో కూడా ఏడాది మరో 8 నుంచి 10 కోట్లు సంపాదిస్తుంది. ఇప్పుడు కోట్ల రూపాయిల రేంజ్‌లో ఉన్న సమంత.. తొలి సంపాదన ఎంతో తెలుసా ? కేవలం 500 రూపాయలు. సినిమా ప్రముఖుల జీవితాల్లో అందరివీ ఇలాంటి ప్రయాణాలే. ఏ సినీ సెలబ్రిటీ ఇందుకు మినహాయింపు కాదు. కానీ సమంత ప్రయాణం వేరు. సమంత ‘హయ్యర్ సెకండరీ స్కూల్’ చదివే రోజుల నుంచే పార్ట్ టైమ్ జాబ్ చేయడం మొదలు పెట్టింది.

మొదట ఆమె జాబ్ ఏమిటో తెలుసా ?, ఓ ఈవెంట్‌లో అతిథులను ఆహ్వానించే యువతిగా సమంత పని చేసింది. తన జీవితంలో ఆమె అందుకున్న మొట్టమొదటి జీతం అదే. 500 రూపాయలు ఇచ్చారు. సమంతకు తన ప్రొఫెషన్ పై గొప్ప పట్టుదల, విశేషమైన కృషి చేయాలనే కసి రావడానికి ముఖ్య కారణం ఆమెకు కష్టం విలువ, అవమానాల రుచి బాగా తెలుసు.
Also Read: Shraddha Das: పెళ్లి అయ్యేలోపు ఫుల్ గా రెచ్చిపోతుందట.. ఇదెక్కడి రచ్చరా బాబు
సమంత రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అవేంటో సమంత మాటల్లోనే.. ‘వాస్తవానికి నేను అసలు నటి అవుదామనుకోలేదు, కానీ పరిస్థితుల ప్రభావం, అవసరాల వల్ల నటిగా మారాను. నేను ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయింది.
ఆ సమయంలో నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దశ్యంతో ఇష్టం లేకపోయినా నేను చాలా జాబ్స్ చేశాను. ఆ జాబ్స్ లో మోడలింగ్ కూడా ఒకటి’ అని సమంత చెప్పుకొచ్చింది. ఆర్థిక అవసరాల కోసం అలా మోడలింగ్ లోకి వచ్చిన సమంత, ఆ తర్వాత అనుకోకుండా యాక్టింగ్ వైపుకు వచ్చింది. ‘ఇండస్ట్రీలో నాకు ఎవ్వరూ గాడ్ ఫాదర్స్ లేకపోయినా కష్టాన్ని నమ్ముకుని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’ అని సమంత తెలియజేసింది.

ఇక సమంత బిజినెస్ లోనూ ప్రవేశించింది. ఆమె ప్రత్యేకంగా ఓ ఫ్యాషన్ బోటిక్ ను నడుపుతుంది. సమంత ఫ్యాషన్ బ్రాండ్ పేరు ‘సాకి’. ఫ్యాషన్ బోటిక్ లో ఏదో పెట్టుబడి పెట్టి వదిలేయకుండా, తానే అన్ని విషయాలను చూసుకుంటూ.. తన మనసుకు నచ్చిన బ్రాండ్స్ ను మాత్రమే తన ఫ్యాషన్ బోటిక్ లో ఉంచుతుంది. ఈ ఫ్యాషన్ బోటిక్ లో సమంత కలెక్షన్ కూడా ఉంది.
అన్నట్టు సమంతకు ప్రత్యూష ఫౌండేషన్ అనే చారిటీ సంస్థ కూడా ఉంది. కేవలం రూ.500 కోసం పని చేసిన సమంత.. ఇప్పుడు కోట్లు సంపాదించే స్థాయికి వెళ్లడం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
Also Read:Ananya Panday: విచ్చలవిడిగా తిరిగేసింది.. పెళ్లి మాత్రం తన పేరెంట్స్ ఇష్టమట

[…] Also Read: Samantha: సీక్రెట్స్ : రూ.500 కోసం ఆ పని చేసిన స… […]