Homeఅంతర్జాతీయంTrump allowed India to buy Russian oil: మీరు ఇచ్చేదేంటి భారత్‌ కు.. అమెరికా,...

Trump allowed India to buy Russian oil: మీరు ఇచ్చేదేంటి భారత్‌ కు.. అమెరికా, ట్రంప్‌ బుద్ది మారదా ఇక?

Trump allowed India to buy Russian oil: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం 12 రోజులుగా కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌ సంక్షోభం తలెత్తుతోంది. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక ఆయిల్‌ ధరలు పెంచాయి. భారత్‌లో ఎల్‌పీజీ కొరత ఏర్పడుతోంది. చైనా కూడా ఆయిల్‌ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో భారత్, చైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటునర్నాయి. ఈ తరుణంలో ఇటీవల ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌ రష్యా నుంచి నెల రోజుల పాటు ఎలాంటి సుంకాలు లేకుండా ఆయిల్‌ దిగుమతికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ట్రంపుగాడు ఏదో తన ఇంట్లో నుంచి ఫ్రీగా స్తున్నట్లు ప్రకటన చేశాడు. కానీ అవసరం వాడిది. చమురు సంక్షోభం యురోపియన్‌ యూనియన్‌ దేశాలకూ తకుతుంది. దీంతో అమెరికాపై ఒత్తిడి పెరుగనుంది. ఆ భయంతో రష్యా ఆయిల్‌ దిగుమతి పెంచాలని భారత్‌ను అమెరికా ఎనర్జీ సెక్రెటరీ కోరాడు. దానిని కప్పిపుచ్చేందుకు ఈ ట్రంపుగాడు భారత్‌కే తానేదో పరిమిషన్‌ ఇచ్చినట్లు ప్రకటించాడు.

ట్రంప్‌ మతి మారినట్టుందా?
గతంలో రష్యన్‌ చమురు ఆపమని ఒత్తిడి చేసిన ట్రంప్‌ ఇప్పుడు మినహాయింపు ఇవ్వడం ఆశ్చర్యకరం. భారత్‌ వెంటనే కొనుగోలు ఆపడం వల్ల ’ఇబ్బంది పెట్టకుండా’ అనుమతి ఇచ్చామని లీవిట్‌ చెప్పారు. ఇరాన్‌ కారణంగా ప్రపంచ చమురు సరఫరా దెబ్బతిన్న సమయంలో ఈ మలుపు భారత్‌కు ప్రయోజనం.

Also Read: తూ.. ఎందుకురా మీ బతుకు.. ఇంత దరిద్రమా.. బిచ్చగాళ్ల డబ్బులూ వదలరా?

భారత్‌కు లాభాలు
భారత్‌ రష్యన్‌ ముడి చమురును కొనుగోలు చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇంధన ధరల పెరుగుదలను అరికట్టి పరిశ్రమలు, ప్రజలకు సహాయం. ట్రంప్‌ ముందు 50% టారిఫ్‌లు విధించి ఒత్తిడి చేసినా ఇప్పుడు మినహాయింపు భారత వ్యూహాస్తులకు గెలుపు.

కేవలం క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకోవాలని తానేదో పర్మిషన్‌ ఇచ్చినట్లు.. ఉచితంగా ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్‌ ’బుద్ధి’ మారినట్టు కనిపించినా ఇది ఆర్థిక ఆట. ఇరాన్‌ యుద్ధం వల్ల ప్రపంచ ఆయిల్‌ కొరత తీవ్రమైతే అమెరికా సొంత ధరలు పెరుగుతాయి. రష్యాకు పెద్ద ఆదాయం కాకుండా చమురు ప్రవాహాన్ని కొనసాగించడమే లక్ష్యం. భారత్‌కు ’మిత్రత్వం’ చూపి భవిష్యత్‌ ఒత్తిడికి మార్గం సుగమం చేస్తోంది.

ఇరాన్‌ సంక్షోభం కొనసాగితే భారత్‌కు మరిన్ని మినహాయింపులు రావచ్చు. ట్రంప్‌ వ్యూహం మారకపోతే ఆయిల్‌ ధరలు పెరుగుతాయి. భారత్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించి ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version