Ustaad Bhagat Singh song removed: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా విడుదల అంటే వారం రోజుల ముందు నుండే ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గత చిత్రం ఓజీ ఏ రేంజ్ క్రేజ్ తో విడుదల అయ్యిందో మన కళ్లారా చూశాము . చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిని థియేటర్ వైపు మొదటి రోజు మొదటి ఆటని చూసేలా చేసింది ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో వండర్స్ ని కూడా క్రియేట్ చేసింది. అలాంటి సినిమా తర్వాత ఆయన నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మరో 8 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ సినిమాపై ఎందుకు ఓజీ మీద ఉన్నంత అంచనాలు లేవు. ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ యావరేజ్ రేంజ్ లో ఉండడంతో కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వలేదు.
ఇదే అభిమానులను కంగారు పడుతోంది. ‘దేఖ్లేంగే సాలా ‘ పాట విడుదల అయినప్పుడు ఫ్యాన్స్ లో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ నుండి ఈ రేంజ్ డ్యాన్స్ అసలు ఊహించలేదు. హరీష్ కి మాత్రమే ఆయనతో ఇలాంటి స్టెప్పులు వేయించడం సాధ్యం అవుతుంది అంటూ ఒక రేంజ్ లో పైకి లేపారు. కానీ ఆ తర్వాత భారీ హైప్ తో విడుదలైన ‘#AuraOfUstaad’ పాటకు మారం డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ‘మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే ‘ ఏంటి ?, 2026 కాలంలో కూడా హీరోకి భజన చేసే ఇలాంటి పాటలు పెట్టడం ఏంటి ?, ఓజీ లాంటి సినిమా చూసిన తర్వాత కూడా డైరెక్టర్స్ లో మార్పు రాకుంటే ఎలా? , ఈ పాటని సినిమా నుండి తొలగిస్తే చాలా మేలు చేసినవాళ్లు అవుతారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే , ఈ పాటని చిత్రం నుండి పూర్తిగా తొలగించేశారట. నిన్న సెన్సార్ స్క్రీనింగ్ కి ఈ పాటని లేకుండానే పంపారట మేకర్స్. ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, సినిమాతో సంబంధం లేకుండా, హీరో కి ఎలివేషన్ ఇచ్చే సినిమాలు ఈమధ్య వర్కౌట్ అవ్వడం లేదు , హరీష్ శంకర్ ఆలస్యంగా అయినా ఈ విషయాన్నీ తెలుసుకొని ఆ పాటని తొలగించినందుకు సంతోషం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ బాగాలేకపోయిన, అందులోని మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. దానిని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకోవచ్చు అంటూ అభిమానులు డైరెక్టర్ హరీష్ శంకర్ కి సలహాలు ఇస్తున్నారు.