Bigg Boss 7 Telugu : ఎపిసోడ్ హైలెట్స్ : సీజన్ 7 మొదటి కెప్టెన్ గా రైతుబిడ్డ… అమర్ కడుపు మంట!

కెప్టెన్ పదవితో పాటు సూపర్ ఇమ్యూనిటీ పొందాడు. మరి ఈ బాధ్యత పల్లవి ప్రశాంత్ ఎలా నెరవేరుస్తాడో చూడాలి...      

Written By: NARESH, Updated On : October 7, 2023 9:19 am

pallavi prashanth

Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ తెలుగు 7 మొదటి కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగుతుంది.ఈ  రేస్ లో బిగ్ బాస్ ఇచ్చిన చివరి టాస్క్ ల్లో గెలిచి గౌతమ్ కృష్ణ , పల్లవి ప్రశాంత్, తేజ, సందీప్ మాస్టర్ పోటీదారులుగా నిలిచారు. వారికి ”రంగు పడుద్ది  రాజా ”అనే చివరి టాస్క్ ఇచ్చాడు. నలుగురు పోటీదారులకు వైట్ టీ షర్ట్ ఇచ్చిన బిగ్ బాస్ రింగులో నిలబడి ప్రత్యర్థుల టీ షర్ట్ కి రంగు పూయాలి. అదే సమయంలో తమ టీ షర్ట్ కి రంగు అంటకుండా చూసుకోవాలి.  ఎవరి టీ షర్ట్ అయితే ఎక్కువ రంగు ఉంటుందో వారు మొదటిగా ఆట నుంచి తప్పుకుంటారు. టాస్స్ ముగిసే సమయానికి తక్కువ రంగు టీ షర్ట్ ధరించి ఉన్న కంటెండర్ విన్నర్ అవుతాడని బిగ్ బాస్ చెప్పాడు. 
 
సంచాలక్ గా ప్రియాంకను నియమించాడు. తేజా మొదటిగా ఓడిపోయాడు. అనంతరం సందీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. సందీప్ మాస్టర్ ని సంచాలక్ ప్రియాంక గేమ్ నుంచి తొలగించింది. సంచాలక్ నిర్ణయం తప్పని  కోపంతో ప్రియాంకపై సందీప్ మండి పడ్డాడు.తోసుకోవద్దు  అని రాశారా , నన్ను తోస్తే వాడి తాట తీస్తానంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేశాడు. వాడి అభిప్రాయం వాడు చెప్పాడు  తప్పేముంది అని శివాజీ అనగానే,’ అన్న నువ్వు కంగారు పడకన్నా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు అంటూ అమర్ అన్నాడు.
 
జనాలు చూస్తున్నారు  వాళ్ళు చెప్తారు లేరా  అని శివాజీ అనగానే, ఆ జనాలు చూస్తే నేను వెళ్ళిపోతా ఎల్లుండి అంటూ ఎప్పటిలానే అతి చేసాడు అమర్. ఎక్కడ పల్లవి ప్రశాంత్ గెలుస్తాడో అనే టెన్షన్ అమర్ దీప్ లో కనిపించింది.  ఆట చివరి దశలో ప్రశాంత్ ఇంకా గౌతమ్ తలపడ్డారు. ప్రశాంత్ గట్టి పట్టు బట్టి గౌతమ్ ని లాక్ చేసాడు. సంచాలక్ ప్రియాంక వదులు లాక్ చేయొద్దు అంటూ మందలించింది. 
 
ఇక టాస్క్ సమయం ముగిసిన నేపథ్యంలో గౌతమ్, పల్లవి ప్రశాంత్ టీ షర్ట్స్ పరిశీలించిన ప్రియాంక విన్నర్ ని ప్రకటించింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అని తేల్చింది. దీంతో అమర్ దీప్ ముఖం మాడిపోయింది. ఇది ఊహించని పరిణామం. టాప్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళను వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. కెప్టెన్ పదవితో పాటు సూపర్ ఇమ్యూనిటీ పొందాడు. మరి ఈ బాధ్యత పల్లవి ప్రశాంత్ ఎలా నెరవేరుస్తాడో చూడాలి…