Dasari Narayana: అప్పట్లో అందరికీ సక్సెస్ లను ఇచ్చిన దాసరి గారు చిరంజీవిని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు… కారణం ఏంటంటే..?

దాసరి ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేసిన ఆయన చిరంజీవితో ఒక్క సినిమాను మాత్రమే చేశాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చేవి. ఇక వీళ్ళ కాంబో లో 'లంకేశ్వరుడు ' అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఈ సినిమా అటు దాసరి గారికి, ఇటు చిరంజీవికి ఇద్దరికీ బ్యాడ్ నేమ్ ని మిగిల్చిందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : July 17, 2024 2:01 pm

Dasari Narayana

Follow us on

Dasari Narayana: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ల హవా అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉండేది. వాళ్ళు ఎలాంటి హీరోనైనా సరే మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని ఆ హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు మంచి విజయాలు అందించడమే కాకుండా వాళ్ళును స్టార్ హీరోలుగా కూడా మార్చేవారు. ఇక ఇలాంటి వాళ్లలో మొదట దాసరి నారాయణరావు గారిని తీసుకోవాలి. ఈయన చేసిన సినిమాలన్నీ కూడా ఒకప్పుడు మంచి విజయాలు సాధించాయి. అయినప్పటికీ ఆయన స్వయంగా కొంతమందిని హీరోలుగా తీర్చిదిద్దాడు.

అందులో ఆర్. నారాయణమూర్తి, మోహన్ బాబు లాంటి వాళ్లు ప్రముఖంగా కనిపిస్తారు. ముఖ్యంగా వాళ్లకు ఉన్న టాలెంట్ వల్ల వీళ్ళు స్టార్ హీరోలుగా నిలబడినప్పటికీ వాళ్ల టాలెంట్ ను గుర్తించి వాళ్ల కు మంచి అవకాశాలను కల్పించింది మాత్రం దాసరి గారే. ఇక దానివల్లే వాళ్ళు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగారు. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేసిన ఆయన చిరంజీవితో ఒక్క సినిమాను మాత్రమే చేశాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చేవి. ఇక వీళ్ళ కాంబో లో ‘లంకేశ్వరుడు ‘ అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఈ సినిమా అటు దాసరి గారికి, ఇటు చిరంజీవికి ఇద్దరికీ బ్యాడ్ నేమ్ ని మిగిల్చిందనే చెప్పాలి.

అసలు ఆ సినిమా మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండానే దాసరి గారు ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా అప్పట్లో కొంతమంది ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేశారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు ఇలాంటి ఒక నాసిరకం కథతో సినిమా చేశాడని, దానివల్లే సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది చెప్తుంటే, మరి కొంతమంది మాత్రం చిరంజీవికి, దాసరికి మధ్య ఉన్న విభేదాల వల్లనే దాసరి గారు ఆ సినిమాను సరిగ్గా తెరకెక్కించలేకపోయాడంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి దాసరి నారాయణరావు తనే రైటర్, డైరెక్టర్ కావడం వల్ల ఒక హీరోకి ఎలాంటి కథ అయితే బాగుంటుందనేది ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఆయా హీరోలతో అలాంటి సినిమాలు చేసి సక్సెస్ లను అందుకున్న ఆయన చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి మాత్రం చతికల పడ్డాడు.

మరి కావాలనే ఆయన అలా చిరంజీవికి ఫ్లాప్ సినిమాని ఇచ్చాడా అనే అనుమానాలు కూడా అప్పట్లో చాలా వరకు వ్యక్తం అయ్యాయి. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబోలో మరొక సినిమా అయితే రాలేదు. ఇక వచ్చిన ఆ ఒక్క సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగలడంతో ఇటు చిరంజీవి, అటు దాసరి గారు ఇద్దరు కూడా చాలా రోజుల వరకు ఎడ ముఖం, పెడ ముఖం పెట్టుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైన కూడా ఒక్కప్పుడు దాసరి గారు చాలా గొప్ప సినిమాలను తీశారు. ఇక మొత్తానికైతే తన ఎంటైర్ కెరియర్ లో 150 చిత్రాలకు దర్శకుడి గా వ్యవహరించి ‘గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు’ ను కూడా సాధించాడు.

నిజానికి ఇప్పుడున్న దర్శకులు ఒకటి రెండు సినిమాలు చేయడానికే చతికిల పడుతుంటే ఆయన సక్సెస్ ఫుల్ గా 150 సినిమాలు కంప్లీట్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అందులో దాదాపు 100కు పైగా సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకోవడం విశేషం… దాసరి గారు ఎంతమందికి ఎన్ని హిట్స్ ఇచ్చిన కూడా మెగా ఫ్యాన్స్ ని మాత్రం అలరించలేకపోయాడు అనేది వాస్తవం…ఇక ఆ సినిమా తర్వాత వీళ్ళ కాంబో ను కలపడానికి చాలా మంది తీవ్ర ప్రయత్నం చేశారు అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు…