Bigg Boss Telugu 6 episode review: బిగ్ బాస్ నామినేషన్ల ఎఫెక్ట్ మంగళవారం కూడా కొనసాగింది. నిన్న నామినేట్ చేసుకున్న వారంతా దానిపై చర్చోపచర్చలు సాగించారు.

అనంతరం చిన్న పిల్లల బొమ్మలు ఇచ్చిన బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఓ ఆట ఆడించారు. వాళ్లను ఏడిపిస్తున్నట్టు వాయిస్ ఇచ్చి కంటెస్టెంట్లతో పాలు పట్టించడాలు.. డైపర్లు మార్పించడాలు..ఇతర చిన్నపిల్లలకు చేసే అన్ని సపర్యలను చేయించారు. ఇది నవ్వులు పూయించింది.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సంచుల్లో దింపేసి కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించారు. ఇందులో రేవంత్ అందరికంటే ముందు నిలిచినా.. ఫైమా చేసిన తప్పుడు పనికి అతడు కెప్టెన్ కాకుండా రెండోస్థానంలో నిలిచిన చలాకీ చంటి గెలిచాడు. దీంతో కెప్టెన్సీ రేసులో చంటి ముందు నిలిచాడు. దీనికి ఎంతో బాధపడ్డ రేవంత్ రెడ్డి ఏడ్చేశాడు. తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు.
ఇక అనంతరం చిన్న పిల్లలను తొట్టెలలో వేసే టాస్క్ లను నిర్వహించారు. ఇందులో గెలిచిన వారు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని ప్రకటించడంతో తోసుకుంటూ ఇంటిసభ్యులంతా పోటీపడ్డారు. పలు సార్లు గంట మోగడం.. ఇంటి సభ్యులంతా ఆ తొట్టెలలో పెట్టి గేమ్ గెలవాలని సూచించారు. దీంతో చాలా మంది తోసుకుంటూ మరీ గేమ్ ఆడారు. రేవంత్ తన బేబీని పోగొట్టుకోవడంతో ఎలిమినేట్ అయిపోయాడు. గీతూ ఏకంగా అభినయశ్రీ, శ్రీవిద్య బేబీలను దొంగించి వారిని గేమ్ నుంచి ఔట్ చేస్తుంది.
బిగ్ బాస్ బేబీలను కాపాడుకోవాలని.. కాపాడుకోలేని వారు కెప్టెన్సీ టాస్క్ నుంచి వైదొలిగినట్టేనని ప్రకటిస్తాడు. ఈ క్రమంలోనే గెలవడం కోసం గీతూ నానా కొంటె పనులు చేస్తుంది. హౌస్ లో నిద్రపోయిన కంటెస్టెంట్ల బొమ్మలను లాక్కొని వాటిని గార్డెన్ ఏరియాలో అర్ధరాత్రి పెట్టేసి వారిని ఔట్ చేస్తుంది. ఇలా గీతూ తను గెలవడం కోసం ఇంటి సభ్యులందరినీ ఏమార్చేస్తుంది.
మొత్తంగా మంగళవారం ఎపిసోడ్ చూస్తే టాస్కుల్లో రేవంత్ ఏడుపును మినహాయిస్తే రోజు మొత్తం చిన్ప పిల్లల బొమ్మల టాస్క్ తో సందడిగానే సాగింది. గీతూ ఈ టాస్క్ లో రెచ్చిపోయి కామెడీని పంచింది.