Bigg Boss 6 Telugu 2nd week Nominations: బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కింది. గత వారం కంటే ఈసారి రెండు గ్రూపులుగా కంటెస్టెంట్లను విభజించిన బిగ్ బాస్ వేరే గ్రూపులోని సభ్యులనే నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు ప్రత్యర్థి గ్రూపులోని వారిని నామినేట్ చేశారు.

ఈ క్రమంలోనే కీర్తి- రేవంత్ మధ్య వాడివేడి వాగ్వాదం జరిగింది. ఇక గీతూతో చలాకీ చంటి మధ్య తీవ్రస్థాయిలో వాదులట పతాకస్థాయికి చేరింది.. గీతూ-రేవంత్ మధ్య కూడా బాగానే గలాటా చోటుచేసుకుంది. ఆరోహీ రావు, ఆదిరెడ్డిలు అయితే పరస్పరం వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లారు.
తొలి వారంలో బిగ్ బాస్ నామినేషన్స్ సందర్భంగా కోపంతో ఊగిపోయిన రేవంత్.. ఈసారి కూడా అందరూ నామినేట్ అయినా.. అందరూ రెచ్చగొట్టేలా మాట్లాడినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని కూల్ గా మాట్లాడాడు. నాగార్జున చెప్పడంతో రేవంత్ ఈ వారం చాలా మెచ్చుర్డ్ గా కనిపించాడు.
నామినేట్ చేయాలనుకుంటున్న ఇంటి సభ్యుడి ఫేస్ కలిగిన కుండలను బావిలో వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ఒక్కరొక్కరూ వచ్చి నామినేట్ చేశారు.
ఆరోహి – ఆదిరెడ్డిని నామినేట్ చేసింది..
శ్రీహాన్ – గీతూను ,
ఫైమా- రేవంత్ ను,
ఆదిరెడ్డి- మెరీనా జోడిని
గీతూ – సింగర్ రేవంత్ ను
అర్జున్ – సింగర్ రేవంత్ ను
నేహా-గీతూను
చలాకీ చంటి -గీతూను
మెరీనా జోడి -ఆదిరెడ్డిని
అభినయశ్రీ-షానీ సాల్మాన్ ను
శ్రీసత్య-షానీ సాల్మాన్ ను..
సుదీప-గీతూను
ఆర్జే సూర్య -గీతూను
కీర్తి భట్ – రేవంత్ ను..
రాజ్ శేఖర్ -రేవంత్ ను..
రేవంత్ -గీతూను
ఇనాయా-ఆదిరెడ్డిని
షానీ సాల్మాన్ -అభినయశ్రీని
వాసంతి-ఫైమా
ఇంటి కెప్టెన్ అయిన కారణంగా బాలాదిత్యకు ఇద్దరినీ నామినేట్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. షానీ, రాజ్ లు ఇద్దరూ హౌస్ నుంచి వెళ్లిపోరని.. నీట్ గా ఆడుతున్నారని..
మొత్తంగా ఈ సోమవారం ఇంటి సభ్యులందరూ చేసిన నామినేషన్స్ ప్రకారం.. నామినేట్ అయిన సభ్యులు వీరే..
రాజ్, షానీ, అభినయశ్రీ, రోహిత్ మెరినా, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి, రేవంత్ లు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వచ్చే వారం తేలనుంది.