South Indian Stars Endorsement Deals : బాలీవుడ్ హీరోలను మించి సౌత్ ఇండియన్ స్టార్స్ హిట్స్ కొడుతూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు. స్థిరమైన హిట్‌లతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్‌లలో సౌత్ ఇండియాకు చెందిన సినీ తారలు బాలీవుడ్ స్టార్‌లను అధిగమిస్తున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రష్మిక మందన్న, సమంతా రుతుప్రభు, ప్రభాస్, విజయ్ దేవరకొండలకు బ్రాండింగ్ యాడ్ కంపెనీలు సంప్రదించి తమ ప్రకటన కర్తలుగా నియమించుకుంటున్నాయి. చాలా మంది నటులకు దీనివల్ల కోట్లకు పడగలెత్తుతున్నారు. మంచి వసూలు చేస్తున్నారు. సౌత్ ఇండియన్స్ స్టార్స్ లలో కొందరు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ వంటి వారి కంటే చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారని ఫైనాన్షియల్ అకేషన్స్ (ET) నివేదిక పేర్కొంది. ఇది తెలిసి సౌత్ ఇండియా సినిమాల పవర్, ఇక్కడి స్టార్స్ సత్తా ఏంటో తెలిసి వచ్చింది.

అల్లు అర్జున్ తాజాగా కోకాకోలా కంపెనీకి ప్రచారకర్తగా సంతకం చేశాడు. అతడు కోకాకోలా తాగుతున్న యాడ్ టీవీల్లో వస్తోంది. “అల్లు అర్జున్ కు పెరుగుతున్న పాన్-ఇండియా పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, హిందీ మాట్లాడే మార్కెట్‌లలో కూడా అల్లు అర్జున్ తో ఎండార్స్‌మెంట్‌ను విస్తరించడానికి మేము ఒప్పందం చేసుకున్నాము” అని కోకాకోలా, ఇండియా మరియు నైరుతి ఆసియాలో వైస్ ఛైర్మన్, విక్రయాల అధిపతి అర్నాబ్ రాయ్ పేర్కొన్నారు. .
అల్లు అర్జున్ ఇప్పటికే రెడ్‌బస్, కెఎఫ్‌సి, జొమాటో మరియు ఆస్ట్రల్ ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 7.5 కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 3-3.5 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నట్టు తెలిసింది..
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో నటించిన రష్మిక మందన్న కింగ్‌ఫిషర్ బీర్, బోట్, క్యాషిఫై మరియు మెక్‌డొనాల్డ్స్‌లను కంపెనీల ప్రకటనలకు ఓకే చెప్పింది. వాటి ప్రకటన కర్తగా చేస్తోంది. రష్మిక మందన్న మరియు అర్జున్‌ల ‘పుష్ప’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లకు పైగా వసూలు చేసింది.
సమంత ప్రభు యాడ్స్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే కుర్కురే, మైంత్రా,అమెజాన్ ప్రైమ్ కలెక్షన్, మామార్త్ మరియు నెస్లే మంచ్ చాక్లెట్‌ల ప్రచారకర్తగా ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె స్థానం పొందిన తర్వాత ఆమె పాన్-ఇండియా స్టార్ గా ఎదిగింది. ఈ యాడ్స్ సంపాదిస్తోంది.
ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత రామ్ చరణ్, ఆలియా భట్‌తో కలిసి ఫ్రూటీ యాడ్స్ లో మెరిసాడు.
ఇక రాయల్ స్టాగ్, టీవీఎస్ మోటార్ మరియు మౌంటైన్ డ్యూలను ఎండార్స్ చేస్తున్న మహేష్ బాబు ఒక్కో ఎండార్స్‌మెంట్ కు ధర రూ. కోటి వసూలు చేస్తున్నట్టు తెలిసింది.
గత రెండు నెలల్లో లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, షంషేరా మరియు జయేష్‌భాయ్ జోర్దార్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, విక్రమ్ వంటి సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ లో రోజుల తరబడి హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.
మునుపటి బాలీవుడ్ ప్రతిభ మసకబారింది.. ఇప్పుడు మెయిన్ సినిమాలుగా బాలీవుడ్ లో దక్షిణాదివే ఆడుతున్నాయి. భారీ ప్రాంతీయ సినిమాలే అభిమానులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ తెస్తున్నాయని సినీ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.