Bigg Boss 7 Telugu -Shivaji : శివాజీ ఫైనల్ కి చేరేలా నాగార్జున ఫేవర్… లేకుంటే ఇంటికే!

శివాజీ బయటకు వెళ్ళిపోతే షో టీఆర్పీ పడిపోతుంది అని బిగ్ బాస్ టీమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : October 22, 2023 6:50 pm

Actor-Sivaji-Entry-to-Nagarjuna

Follow us on

Bigg Boss 7 Telugu -Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఆరు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఏడో వారం కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ 7 లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఒకడిగా హీరో శివాజీ హౌస్ లోకి అడుగు పెట్టారు. అసలు ఆయన ఏమి ఆడతాడు అని అంతా అనుకున్నారు. కానీ తన ఆట తీరుతో పాటు మైండ్ గేమ్ తో అందరిని మెప్పించాడు. దీంతో శివాజీకి క్రేజ్ మామూలుగా లేదు.

ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్న సమయంలో శివాజీ చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే.దాంతో శివాజీ ఫిజికల్ టాస్క్ లు ఆడలేక పోతున్నారు. కంటెస్టెంట్స్ పదే పదే శివాజీ ని టార్గెట్ చేసి ఆడ లేక పోతున్నాడు అని అంటున్నారు. దీంతో శివాజీ ఆ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతాను నన్ను పంపించండని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశాడు. దీనికి బిగ్ బాస్ డాక్టర్లు పరిశీలించిన తర్వాత బయట చికిత్స అవసరం అనుకుంటే పంపిస్తాము అని చెప్పారు.

ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్ అర్జున్… శివాజీ అన్న హెల్త్ ఇష్యూ తో బాధ పడుతున్నారు. టాస్క్ లు కూడా ఆడ లేక పోతున్నారు. కాబట్టి ఆయనను ఇలా ఎన్ని రోజులు సంచాలక్ గా ఉంచుతూ గేమ్స్ ఆడించకుండా హౌస్ లో కొనసాగిస్తారు అని అందరూ అనుకుంటున్నారు అని అడిగాడు. శివాజీ ని నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. శివాజీ ఇప్పుడు నీకు అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడిగారు.

దానికి శివాజీ చెయ్యి మొత్తం లాగుతుంది. భుజం దగ్గర మంటగా వుంది. చాలా ఇబ్బందిగా ఉంది. గేమ్ కూడా సరిగ్గా ఆడలేక పోతున్న మీకు ఒక మాట చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఫిజియో థెరపీ చేస్తే బెటర్ అవుతుంది అని అనిపిస్తుంది. ‘ఆ ఫిజియో థెరపీ ఇక్కడే చేయిద్దాం’. రోజుకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చేస్తారు. మెరుగైన చికిత్స చేయిద్దాం. ఆ తర్వాత కూడా తగ్గకపోతే నిన్ను ఇంటికి పంపిస్తారు అని చెప్పాడు.శివాజీ బయటకు వెళ్ళిపోతే షో టీఆర్పీ పడిపోతుంది అని బిగ్ బాస్ టీమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి.