Amardeep vs Prashanth : లం*** కొడకా బయటకు దిగరా… అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి! వీడియో వైరల్

బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ మీద కూడా దాడి జరిగింది. ఆమె మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కాగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.

Written By: NARESH, Updated On : December 18, 2023 9:49 am
Follow us on

Amardeep vs Prashanth : బిగ్ బాస్ షో జనాల మీద ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పేందుకు తాజా ఘటనలే నిదర్శనం. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కొందరు కంటెస్టెంట్స్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హౌస్లో పల్లవి ప్రశాంత్ కి వ్యతిరేకంగా మాట్లాడిన కంటెస్టెంట్స్ పై ఫ్యాన్స్ దాడులకు పాల్పడుతున్నారు. టేస్టీ తేజ పలుమార్లు ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. 9వ వారం ఎలిమినేటైన తేజ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసే ప్రయత్నం చేశారు. గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ముఖ్యంగా అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ కి ఎక్కువగా ఫైట్ జరిగింది. ఆరంభంలోనే అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ ఆడుతున్నావ్ అంటూ అటాక్ చేశాడు. అది అమర్ కి కూడా మైనస్ అయ్యింది. ఇక 14వ వారంలో పల్లవి ప్రశాంత్ పట్ల అమర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ టాస్క్ లో ప్రశాంత్ మీద అమర్ దాడి చేశాడు. అతని వేలు కొరికాడు. ప్రశాంత్ అమర్ మీద సంచాలక్ కి కంప్లైంట్ చేశాడు. అనంతరం అమర్ పిచ్చి పట్టినవాడిలా ప్రవర్తించాడు.

ప్రశాంత్ ని నెట్టుకుంటూ హౌస్లోకి తీసుకెళ్లాడు. ఇది విమర్శలపాలైంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ మీద కోపం పెంచుకున్నారు. ఆదివారం ఎపిసోడ్ ముగిశాక అమర్ దీప్ తన కారులో బయటకు వచ్చాడు. అమర్ ని చూసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. కారు అద్దాలు పగలగొట్టారు. బయటకు దిగరా.. అంటూ బూతులు తిట్టారు.కారు లోపల ఉన్న అమర్ భయానికి గురయ్యాడు. గార్డ్స్ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. చాలా మంది అమర్ కారును చుట్టుముట్టారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పలువురు ఈ దాడిని ఖండిస్తున్నారు. ఏం జరిగినా అది గేమ్లో భాగమే. కంటెస్టెంట్స్ మీద ఇలా దాడి చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ మీద కూడా దాడి జరిగింది. ఆమె మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కాగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.