మొదటిసారి మెట్టు దిగొచ్చిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. కానీ.. ఊహించని విధంగా ఆ చట్టాలపై రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురుకావడంతో ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులను ఏ విధంగా ఒప్పించాలి.. అగ్రి చట్టాలపై ఎలా ముందుకెళ్లాలో తెలియక మొదటి సారి కేంద్రం సతమతం అవుతున్నట్లు చర్చ నడుస్తోంది. Also Read: జమిలీకి మోడీ సై.. అన్ని పార్టీలు ఓకే అనాల్సిందేనా.. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండు సార్లు అధికారం చేపట్టారు. […]

Written By: Srinivas, Updated On : December 22, 2020 2:38 pm
Follow us on


ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. కానీ.. ఊహించని విధంగా ఆ చట్టాలపై రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురుకావడంతో ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులను ఏ విధంగా ఒప్పించాలి.. అగ్రి చట్టాలపై ఎలా ముందుకెళ్లాలో తెలియక మొదటి సారి కేంద్రం సతమతం అవుతున్నట్లు చర్చ నడుస్తోంది.

Also Read: జమిలీకి మోడీ సై.. అన్ని పార్టీలు ఓకే అనాల్సిందేనా..

కేంద్రంలో నరేంద్ర మోడీ రెండు సార్లు అధికారం చేపట్టారు. ఇన్నాళ్ల ఆయన పదవి కాలంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యంగా నోట్ల రద్దు దేశాన్ని కుదిపేసింది. అయితే.. నోట్ల ర‌ద్దు కార‌ణంగా చిన్నా చిత‌కా ప‌రిశ్రమ‌లు మూతపబ‌డ్డాయి. అంతేకాదు.. కొత్త ప‌రిశ్రమల ఏర్పాటు కూడా సాధ్యం కాలేదు. ఇది ఒక‌ర‌కంగా మైన‌స్సే. అయినా.. మోడీ పెద్దగా ఆవేద‌న చెంద‌లేదు. ప్రజ‌ల‌కు ఎప్పుడూ దండాలు పెట్టిన దాఖలాలూ లేవు. ఆ తర్వాత మరో కీలక సంస్కరణగా జీఎస్టీ తీసుకొచ్చారు. ఇది రాష్ట్రాల ఆదాయాన్ని హ‌రించి వేస్తుంద‌ని పేర్కొంటూ.. కొన్ని రాష్ట్రాలు యుద్ధమే ప్రకటించాయి. అయినా.. మోడీ వెన‌క్కి త‌గ్గలేదు. రాష్ట్రాల‌ను బతిమాలుకున్నది కూడా లేదు.

కానీ.. తాజాగా తీసుకున్న వ్యవసాయ సంస్కరణల నిర్ణయం మాత్రం మోడీని వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. మూడు వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన మోడీకి.. రైతుల నుంచి తీవ్రస్థాయిలో సెగ త‌గులుతోంది. పంజాబ్, హ‌రియాణా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల నుంచి రైతులు.. ఢిల్లీకి చేరువ‌లో ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా వారు ఎముక‌లు కొరుకుతున్న చ‌లిని సైతం లెక్కచేయ‌కుండా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Also Read: రజనీ సీఎం క్యాండిడేట్‌ కాదా..!

మరోవైపు.. ప్రధాని మోడీ కూడా మొదట్లో ఈ ఉద్యమాన్ని లైట్‌ తీసుకున్నారు. కొన్నాళ్లకు బ‌ల‌ప్రయోగంతో అణిచి వేయాల‌ని చూశారు. కానీ, రైతులు భీష్మించారు. ఇక‌.. అన్నదాత‌ల‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయుల నుంచి మ‌ద్దతు ల‌భించింది. ఇటీవ‌ల జ‌రిగిన భార‌త్ బంద్‌కు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ప‌రిణామాల‌తో కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి వచ్చింది. రైతు సంఘాల నేతలు చర్చించింది. కానీ.. అవి పెద్దగా ఫ‌లించ‌లేదు. చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు తెస్తామ‌ని, మ‌ద్దతు ధ‌ర‌కు భ‌రోసా ఇస్తామ‌ని కేంద్రం చెప్పినా.. కార్పొరేట్ వ్యవ‌సాయాన్ని ప్రోత్సహించే ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేన‌ని రైతులు ప‌ట్టుదలతో ఉన్నారు.

ఇక ఇలా కాదని.. స్వయంగా మోడీ రంగంలోకి దిగారు. వ్యవ‌సాయ మంత్రి తోమ‌ర్‌ను కూడా బ‌రిలోకి దింపారు. కేవ‌లం ఒక్క రాష్ట్రంలోనే ఉద్యమం ఉంద‌ని చెప్పించారు. అయినా.. ఆ పాచిక పారలేదు. దీంతో ప్రజ‌ల‌కు ప‌డిప‌డి ద‌ండాలు పెట్టి మద్దతు కోరారు. ‘మేం మ‌ద్దతు ధ‌ర‌ల‌కు మ‌ద్దతు ఇస్తామ‌ని.. స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌కు పెద్దపీట వేస్తాం’ అని చెప్పుకొచ్చారు. అయినా.. రైతులు వినలేదు. చివరకు వారిని ఒప్పించేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది. ప్రధాని మోడీ పాల‌న‌లో ఇదే తొలిసారి అని చెప్పాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్