మనలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కొంతమందికి ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి. అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సైబర్ మోసాల గురించి తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సైబర్ మోసాల గురించి అవగాహన లేని పక్షంలో మోసపోయే అవకాశం ఉండటంతో పాటు బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు..?
గతంలో డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుందంటూ.. ఆధార్ కార్డ్ అప్ డేట్ చేయించుకోవాలంటూ సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడేవారు. అయితే ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ఈ మెయిల్ సహాయంతో సైతం మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఒకే ఒక్క ఈమెయిల్ ద్వారా మోసగాళ్లు బ్యాంక్ ఖాతాలోని నగదును మాయం చేస్తున్నారు. మోసగాళ్లు ఈ మెయిల్ ఐడీకి బ్యాంకు నుంచి పంపినట్లుగా మెయిల్ పంపుతున్నారు.
Also Read: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.300 చెల్లిస్తే రూ.2 లక్షలు మీ సొంతం..!
ఆ మెయిల్ లో లాగిన్ లో అయ్యి బ్యాంక్ అకౌంట్ యొక్క యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేయమని కోరుతున్నారు. పొరపాటున ఆ లింక్ ఉపయోగించి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రం బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. ఆ తరువాత బ్యాంక్ ఖాతాలో నగదు మాయమై బాధ పడినా ప్రయోజనం ఉండదు. అలాంటి మెయిల్ ఐడీకి వచ్చే ఫేక్ ఈ మెయిల్స్ విషయంలో అవగాహన కలిగి ఉండాలి.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: జనరల్
ఈమెయిల్ నుంచి బ్యాంక్ అకౌంట్ లోకి లాగిన్ కావడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ కు వచ్చే ఈ మెయిల్ ఐడీని బట్టి ఆ మెయిల్ నిజంగా బ్యాంక్ నుంచే వచ్చిందో లేక ఎవరైనా సైబర్ మోసగాళ్లు పంపారో సులభంగా కనిపెట్టవచ్చు.